బీజేపీని గెలిపిస్తే తెలంగాణలో 3 సార్లు దీపావళి: అమిత్ షా

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రజలకు ఈ ఏడాది మూడు సార్లు దీపావళి వస్తుందని కోరుట్ల మీటింగ్ లో అమిత్ షా అన్నారు. ఇప్పటికే ఓ దీపావళి రాగా.. కౌంటింగ్ రోజున మరో దీపావళి వస్తుందన్నారు. జనవరిలో రామ మందిరం ప్రారంభం తర్వాత మూడో దీపావళి వస్తుందన్నారు.

New Update
Amith Shah: యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తాం- అమిత్ షా

ఈ సారి తెలంగాణలో మూడు సార్లు దీపావళి అని అమిత్ షా (Amith Shah) అన్నారు. ఈ రోజు కోరుట్లలో జరిగిన బీజేపీ (BJP) ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ సా మాట్లాడుతూ.. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఒక దీపావళిని జరుపుకున్నారన్నారు. డిసెంబర్ 3న బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు మరో దీపావళిని జరుపుకోవాలన్నారు. జనవరిలో అయోద్యలో రామ మందిరం ప్రారంభించిన తర్వాత మూడో దీపావళి వస్తుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచితంగా రామ మందిర దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ కేసీఆర్ చేతిలో లేదన్నారు.అది ఎంఐఎం చేతిలో ఉందన్నారు.
ఇది కూడా చదవండి: CM KCR: ఒకే విడతలో రూ.10లక్షలు.. సీఎం కేసీఆర్ సంచలన హామీ

పసుపు రైతుల కోసం పసుపు బోర్డు తీసుకువచ్చామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మూతబడ్డ మూడు షుగర్ పార్టీలను తిరిగి తెరిపిస్తామన్నారు. నిజామాబాద్ లో బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్నారు అమిత్ షా. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలేనని ధ్వజమెత్తారు. బీజేపీని గెలిపిస్తే కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: BREAKING: మేడ్చల్‌లో హైటెన్షన్‌.. కొట్టుకున్న BRS, కాంగ్రెస్ శ్రేణులు

బీఆర్ఎస్ ప్రభుత్వమంతా కుంభకోణాల మయం అని ఆరోపించారు. అవినీతి చేసిన వారిని జైళ్లే వేసే పనిని బీజేపీ తీసుకుంటుందన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు