TS BJP: బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటెయ్యండి: అమిత్ షా పిలుపు బీజేపీ గెలిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు గద్వాలలో నిర్వహించిన బీజేపీ సభలో ఆయన పాల్గొన్నారు. తమను గెలిపిస్తే ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. By Nikhil 18 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి రూ.70 కోట్లు జోగులాంబ ఆలయం కోసం ప్రధాని మోదీ (Modi) విడుదల చేస్తే ఆ నిధులను కూడా సీఎం కేసీఆర్ (CM KCR) ఖర్చు చేయలేదని అమిత్ షా (amit shah) ధ్వజమెత్తారు. ఈ రోజు గద్వాలలో నిర్వహించిన పార్టీ ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు (BRS) వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైందన్నారు. బీసీలకు కేసీఆర్ సర్కార్ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. బీసీలకు తామే అత్యధిక సీట్లు ఇచ్చామన్నారు. ఇది కూడా చదవండి: Big Breaking: ప్రచారంలో స్పృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత కేంద్రంలో 27 మంది ఓబీసీలను మంత్రులుగా చేశామని గుర్తు చేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే బీజేపీ రావాలన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి చేయకుండా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. బీజేపీకి అవకాశం ఇస్తే రానున్న ఐదేళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ చేయనందునే నిరుద్యోగి ప్రవళి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కేసీఆర్ తెలంగాణలోని నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు బీసీ వ్యతిరేక పార్టీలని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఎఐం పార్టీలు 2జీ, 3జీ,4జీ పార్టీలని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఈ పార్టీల నుంచి విముక్తి కల్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అత్యంత అవినీతి పార్టీ అని దుమ్మెత్తి పోశారు. #telangana-elections-2023 #amit-shah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి