TS elections 2023: 16 మందితో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్.. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి!

కాంగ్రెస్‌ మూడో అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది. 16మందితో కూడిన లిస్ట్‌ను విడుదల చేసింది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు పోటీగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేయనున్నారు.

New Update
TS elections 2023: 16 మందితో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్.. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి!

16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ మూడో లిస్ట్ విడుదల చేసింది. కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పోటీ చేయనున్నారు. షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటి చేస్తుండగా.. బోథ్ అభ్యర్థిని మార్చారు. వెన్నెల అశోక్ ప్లేస్ లో ఆదే గజేందర్‌ను నిలబెట్టారు. వనపర్తి లో అభ్యర్థిని మార్చారు. చిన్నారెడ్డి ప్లేస్ లో మేఘారెడ్డికి అవకాశం ఇచ్చారు. పఠాన్ చెరులో నీలం మధుకు అవకాశం ఇవ్వగా.. చెన్నూరు నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన వివేక్ పోటీ చేస్తున్నారు. ఇంకా నాలుగు స్థానాలు ప్రకటించలేదు. మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ స్థానాలను ప్రకటించలేదు.

publive-image కాంగ్రెస్ మూడో అభ్యర్థుల జాబితా విడుదల

సీఎం కేసీఆర్‌పై పోటీకి రేవంత్‌ రెడ్డి సై అన్నారు. ముందు నుంచి కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నట్లుగానే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీచేసేందుకు రేవంత్‌ సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ మూడో జాబితా విడుదలైంది. ఈ జాబితాలో 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, రెండు స్థానాల్లో (బోథ్‌, వనపర్తి) అభ్యర్థులను మార్చింది అధిష్టానం. అలాగే కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌ పోటీ చేయాలని ఆదేశించింది. మరో ఐదు స్థానాల్లో ఒకటి సీపీఐకి ఇవ్వగా, నాలుగు స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. సీపీఎంపై చివరి వరకు చర్చలు జరుపుతామని కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నాలుగు సీట్లలో రెండు లేదా ఒక సీటును సీపీఎం కోసం పెండింగ్‌లో పెట్టారా అన్న చర్చ తెరపైకి వచ్చింది. వీటిలో ప్రధానంగా మిర్యాలగూడ,

1. చెన్నూరు: గడ్డం వివేక్‌
2. బోథ్‌ - ఆడె గజేందర్‌
3. జుక్కల్: తోట లక్ష్మి కాంతారావు
4. బాన్సువాడ : ఏనుగు రవీందర్ రెడ్డి
5. కామారెడ్డి : రేవంత్ రెడ్డి
6. నిజామాబాద్ అర్బన్: షబ్బీర్ అలీ
7. కరీంనగర్‌: పురుమల్ల శ్రీనివాస్
8. సిరిసిల్ల : కొండం కరుణ మహేందర్‌ రెడ్డి
9. నారాయణ్ ఖేడ్ : సురేష్ కుమార్‌ షెట్కర్
10. పఠాన్ చెరువు: నీలం మధు ముదిరాజ్‌
11. వనపర్తి : తుడి మెఘా రెడ్డి
12. డోర్నకల్: రామ్ చంద్ర నాయక్
13. ఇల్లందు: కోరం కనకయ్య
14. వైరా: రామ్‌దాస్‌ మాలోత్‌
15. సత్తుపల్లి - మట్టా రాగమయి
16. అశ్వారావుపేట - జారె ఆదినారాయణ

Also Read: జై తెలంగాణ అన్న పాపాన పోలే.. మళ్లా దోఖా చేసేందుకు వస్తున్నరు!

Advertisment
Advertisment
తాజా కథనాలు