BREAKING: 'అధికారం మనదే'.. కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. తాజాగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన మంత్రులతో భేటీ కానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. By V.J Reddy 01 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Polling: తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. తాజాగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన మంత్రులతో భేటీ కానున్నారు. సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఎన్నికల ఫలితాలు రాకముందే కేసీఆర్ ఇలాంటి సంచలన ప్రకటం చేయడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నట్లు కేసీఆర్ పరోక్షంగా ప్రకటన చేసినట్లు కనిపిస్తుంది. కేసీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సహం రెట్టింపు అయింది.. అధికారంలోకి వచ్చేది తామే అంటూ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు కేసీఆర్ ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఆందోళన నెలకొంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటలకు.. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. (File Pic) pic.twitter.com/ZFUJukFl0I — BRS Party (@BRSparty) December 1, 2023 #kcr #telangana-cabinet #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి