Revanth Reddy: 63 నియోజకవర్గాలు, 87 సభలు.. రేవంత్ ప్రచారం హైలైట్స్ ఇవే!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తన మార్క్‌ను చూపించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 నియోజకవర్గాల్లో 87 సభలు నిర్వహించి దుమ్ము లేపారు. తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలైన కొడంగల్‌, కామారెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ చీఫ్‌ హోదాలో ప్రచారం నిర్వహించారు.

New Update
Revanth Reddy: 63 నియోజకవర్గాలు, 87 సభలు.. రేవంత్ ప్రచారం హైలైట్స్ ఇవే!

ఎన్నికల ప్రచారంలో భాగంగా నోటిఫికేషన్ నుంచి నుంచి ప్రచారం ముగిసే వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దాదాపు 63 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అక్టోబర్ 16న వికారాబాద్ లో నిర్వహించిన సభ నుంచి నవంబర్ 28వ తేదీన మాల్కాజిగిరి రోడ్ షోతో కలపి 87 ప్రచార సభలో పాల్లొన్నారు. ఓ మాటలో చేప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఆయన ముందుండి నడిపించారు. ఒక్కో రోజు మూడు, నాలుగు మీటింగ్స్ లో పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో మరో నేత ఎవరూ ఈ స్థాయిలో మీటింగ్ లలో పాల్గొనలేదు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: సమస్యలన్నిటికీ ఇందిరమ్మ రాజ్యమే పరిష్కారం

వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్ రూరల్, కొడంగల్, కామారెడ్డి, గజ్వేల్, దుబ్బాక, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అలంపూర్, గద్వాల, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జుక్కల్, ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, డోర్నకల్, ఎల్ బీ నగర్, మహేశ్వరం, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, వర్ధన్నపేటతో పాటు..

జనగాం, పాలకుర్తి, మేడ్చల్, అంబర్ పేట, మెదక్, సంగారెడ్డి, మానకొండూరు, హుజురాబాద్, రాజేంద్రనగర్, సనత్ నగర్, సికింద్రాబాద్, నర్సాపూర్, వనపర్తి, నారాయణఖేడ్, ముషీరాబాద్, పఠాన్ చెరు, నారాయణపేట, నకిరేకల్, ఆలేరు, తుంగతుర్తి, రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, షాద్ నగర్, ఆర్మూర్ తదితర నియోజకవర్గాల్లో రేవంత్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు