TS Election Results: దూసుకెళ్తున్న కాంగ్రెస్.. 70 సీట్లు దాటే ఛాన్స్? తెలంగాణ ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యత దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే 65కు పైగా స్థానాల్లో లీడ్ లో ఉండగా.. ట్రెండ్స్ ఇలానే కొనసాగితే ఆ సంఖ్య 70 దాటే అవకాశం ఉంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ వెనకంజలో ఉన్నారు. By Nikhil 03 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుమ్ములేపుతోంది. స్పష్టమైన ఆధిక్యత దిశగా దుసుకెళ్తోంది. 68 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అధికార బీఆర్ఎస్ ప్రస్తుతం 40 సీట్లలో టాప్ లో ఉంది. ప్రస్తుత ట్రెండ్స్ ఇలానే కొనసాగితే బీజేపీ 5 సీట్లను కూడా సాధించడం కష్టం అని చెప్పొచ్చు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో వెనబడడం గులాబీ నేతలను షాక్ కు గురి చేస్తోంది. అక్కడ బీజేపీ లీడ్ లో ఉంది. ఉమ్మడ నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మినహా మిగతా అన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు వెనకబడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డిలో కారు జోరు కాస్త కనపపుతోంది. గజ్వేల్ లో కేసీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు, సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ కీలక నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ముందంజలో ఉండడం విశేషం. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కాస్త ముందంజలో ఉంది. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్న సిర్పూర్ లో కౌంటింగ్ రసవత్తరంగా మారింది. అక్కడ బీజేపీ, బీఎస్పీ మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా లెక్కలు మారుతున్నాయి. ఇది కూడా చదవండి: Election Counting 🔴 Live: తెలంగాణలో దుమ్ములేపుతున్న కాంగ్రెస్. . ఆ జిల్లాల్లో క్లీన్ స్వీప్! #congress #telangana-election-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి