కాంగ్రెస్ అభ్యర్థులకు రాహుల్ గాంధీ కీలక సూచనలు కాంగ్రెస్ అభ్యర్థులకు రాహుల్ గాంధీ కీలక సూచనలు చేశారు. రేపు అందరు ఓట్ల లెక్కింపు కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు తెలిపారు. ఏఐసీసీ పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని పేర్కొన్నారు. By V.J Reddy 02 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rahul Gandhi: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపుపై వారితో సమీక్ష నిర్వహించారు. మీటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. ALSO READ: ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు! కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు ఏఐసీసీ ఆదేశం ఇచ్చినట్లు సమాచారం. ఏఐసీసీ పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని తెలిపారు. వెంటనే హైదరాబాద్‌కు రావాలని పిలిచిన అభ్యర్థులను రావద్దని మళ్లీ చెప్పిన పీసీసీ నేతలు. ఈరోజు రాత్రి 11:30 గంటలకు హైదరాబాద్‌కు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్నారు. తాజ్ కృష్ణా హోటల్లో రాత్రికి బస చేయనున్నారు డీకే. రేపు తాజ్ కృష్ణా నుంచి కౌంటింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించనున్నారు. రేపు మార్నింగ్ మరికొందరు ఏఐసీసీ నేతలు రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తుంది. ALSO READ: మందుబాబులకు షాక్.. తెలంగాణలో రేపు వైన్ షాప్‌లు బంద్.. #congress #rahul-gandhi #telangana-election-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి