TS Elections 2023: సొంత పార్టీకి షాక్ ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మల.. వైరల్ గా మారిన వ్యాఖ్యలు

మోటార్లకు మీటర్లు పెట్టనందుకే తెలంగాణ ప్రభుత్వానికి అదనపు రుణాలు ఇవ్వలేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

New Update
TS Elections 2023: సొంత పార్టీకి షాక్ ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మల.. వైరల్ గా మారిన వ్యాఖ్యలు

ఈ రోజు తెలంగాణలో (Telangana) పర్యటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ( Nirmala Sitharaman) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు ఆమె మీడియాలో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి తెలంగాణకు ఇవ్వాల్సిన రుణం ఇచ్చామన్నారు. అదనపు రుణం ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ పాటించాలని స్పష్టం చేశారు. కండిషన్స్ పాటించకుండా అదనపు రుణం ఒక్క తెలంగాణకు ఇవ్వడం ఎలా వీలు అవుతుందని ప్రశ్నించారు. మోటర్లకు మీటర్లు పెట్టనందుకే.. తెలంగాణకు అదనపు రుణానికి అనుమతి ఇవ్వలేదని వివరించారు. ఇతర రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా అదనపు రుణాలు తీసుకున్నాయని తెలిపారు.
ఇది కూడా చూడండి: Telangana Elections: బీఆర్‌ఎస్ వస్తే మోటార్లకు మీటర్లే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే.. రైతులకు నష్టం చేకూర్చేలా మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం రూల్ పెట్టిందని సీఎం కేసీఆర్ మూడేళ్లుగా అనేక సభల్లో చెబుతున్నారు. రైతుల మేలు కోసం అదనపు రుణం ఇవ్వకున్నా పర్వలేదని తాము ఆ నిబంధనను అమలు చేయలేదని వివరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి పవర్ స్టార్.. కేసీఆర్, కాంగ్రెస్ పై పంచులు పేలుస్తారా?

ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. కీలకమైన ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని బీజేపీ నేతల్లో చర్చ సాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు