KTR: రాబందులను తరిమికొట్టండి!.. కాంగ్రెస్ పై కేటీఆర్ చురకలు! రైతు బంధు నిధుల విడుదల ఆపేయాలని ఈసీ బీఆర్ఎస్ పార్టీకి ఆదేశాలు ఇవ్వడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వల్లే నిధులు ఆగాయని అన్నారు. రాబందులను తరిమికొట్టండి అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. By V.J Reddy 27 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: రైతుబంధు(Rythu Bandhu) సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకోవడంపై మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వల్లే ఎన్నికల కమిషన్ ఇలా చేసిందని అన్నారు. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉండడం కాంగ్రెస్ వాళ్లకు నచ్చదని విమర్శించారు. ALSO READ: రైతుబంధుకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఈసీకి బీఆర్ఎస్ రిక్వెస్ట్! మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ.. పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..?, ఎరువులకు విత్తనాలకు పైసలిచ్చే రైతబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు..?, ఎవుసం చేసే రైతులపైన పగ ఎందుకు..?, అన్నదాతకు సాయం అందకుండా అడ్డుపుల్లలు వేసి వికృతానందం పొందుతున్నారెందుకు...?, దుక్కిదున్నే బక్క రైతులపై ద్వేషం ఎందుకు...?, అన్నంపెట్టే రైతుల మీద అక్కసు ఎందుకు..?, కర్షకుడికి కడుపునిండా కరెంట్ ఇస్తుంటే చూసి ఓర్వలేని బుద్ధి ఎందుకు..?, 3 గంటల కరెంటే ఇస్తం..10 హెచ్ పీ మోటర్లు పెట్టుకోవాలని మూర్ఖంగా ప్రకటిస్తున్నారెందుకు..?, రైతుచేనుకు రక్షణ కంచెగా వుండే ధరణి మీద కక్ష ఎందుకు..? అని ప్రశ్నించారు. 'దళారుల రాజ్యం తెచ్చి భూమేతకు అనుమతి ఇస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారు ఎందుకు..?, కౌలు రైతులకు..అసలు రైతులకు మధ్య అగ్గిపెట్టి భూములు పడావు పెట్టే ప్రమాదాన్ని తెస్తున్నారెందుకు..?, అన్నదాతలారా..మీ వెన్నువిరిచే కాంగ్రెస్ కంత్రీ పాలసీలను జాగ్రత్తగా పరిశీలించండి..!, పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండుగ చేసే దరిద్రపు రోజులు కావాలా ..? ఆలోచించండి..!, రైతుబంధువును ఆదరించండి..!, రాబందులను తరిమికొట్టండి.' అని రాసుకొచ్చారు. పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..? ఎరువులకు విత్తనాలకు పైసలిచ్చే రైతబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు..? ఎవుసం చేసే రైతులపైన పగ ఎందుకు..? అన్నదాతకు సాయం అందకుండా అడ్డుపుల్లలు వేసి వికృతానందం పొందుతున్నారెందుకు...? దుక్కిదున్నే బక్క రైతులపై ద్వేషం… — KTR (@KTRBRS) November 27, 2023 ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన! #ktr #congress #telangana-elections-2023 #telugu-latest-news #rythu-bandhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి