Telangana Elections 2023 : వడ్డీ లేకుండా హోం లోన్స్... సంచలన స్కీం ప్రకటించిన కేటీఆర్..!!

తెలంగాణలో ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ సరికొత్త ప్రకటన చేశారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం, గృహ లక్ష్మీ పథకాలతో దూసుకుపోతున్నది బీఆర్ఎస్. వడ్డీలేకుండానే హోంలోన్ ఇచ్చేలా కొత్త పథకాన్ని తెస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

New Update
Telangana Elections 2023 : వడ్డీ లేకుండా హోం లోన్స్... సంచలన స్కీం ప్రకటించిన కేటీఆర్..!!

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్నాకొద్దీ అన్ని పార్టీలు కొత్తపథకాలు, సరికొత్త గ్యారెంటీలతో ప్రజలకు నాడీ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పోటాపోటీ హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేసీఆర్ ఓ కొత్త పథకాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అందరికీ ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో తమ సర్కార్ పనిచేస్తోందన్న కేటీఆఱ్..అందుకోసమే ఇప్పటికే డబుల్ బెడ్రూం పథకం, గృహ లక్ష్మీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వీటికి తోడు మరోకొత్త పథకం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచన చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. వడ్డీలేకుండానే హోంలోన్ ఇచ్చేలా కొత్త పథకాన్ని తెస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

హౌజింగ్ ఫర్ ఆల్ అనేది మా నినాదమన్న మంత్రి కేటీఆర్ దాన్ని అమలు చేసి చూపిస్తామని తెలిపారు. నిరక్షరాస్యత అనేది ఉండకూడదని..అందరూ చదువుకోవాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ స్కీం, గృహలక్ష్మీ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. 1200, 1500చదరపు గజాల ఇళ్లు కొనే మధ్య తరగతి ప్రజల కోసం వడ్డీలేని హోంలోన్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెప్పారు. దాన్ని తప్పకుండా అమలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. లోన్ కట్టే శక్త ఉండి..వడ్డీని సర్కార్ కడితే చాలనుకునేవారికి ఈ స్కీం వర్తింపజేస్తామని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణలో ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్, గృహలక్ష్మీ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. తెల్లరేషన్ కార్డు ఉండి..ఇళ్లు లేని పేదలకు, డబుల్ బెడ్రూంలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించి...లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను సెలక్ట్ చేస్తామన్నారు. వీరిలోకొందరికి ఇప్పటికే ఇళ్లను అప్పగించినట్లు చెప్పారు. స్థలం ఉండి ఇళ్లు కట్టుకునేవారికి గృహలక్ష్మీ ద్వారా రూ. 3లక్షలు ఇస్తున్నామని కేటీఆర్ అన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే లబ్ధిదారులను సెలక్ట్ చేసినట్లు తెలిపారు.

ఇక అటు బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ తోపాటు, కేటీఆర్, హారీశ్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ రంగంలోకి దిగి జెడ్ స్పీడ్ తో పరుగెడుతున్నారు. అటు రేవంత్ రెడ్డి బహిరంగసభలో ఉర్రూతలూగిస్తున్నారు. అమిత్ షా కూడా వరుస సమావేశాలతో పార్టీని, కార్యకర్తలను, ప్రజలను ఆకర్షిస్తున్నారు. అటు ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. బీజేపీ, జనసేన కూటమి తరపున పవన్ కల్యాణ్ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇలా ప్రధాన నేతలంతా రంగంలోకి దిగడంతో ప్రచార పర్వం మరింత వేడెక్కింది.

అటు తెలంగాణ నవంబర్ 15తో నామినేషన్ల పర్వం ముగిసినసంగతి తెలిసిందే. నవంబర్ 30 పోలింగ్ , డిసెబర్ 3న కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ ప్రకటించింది. తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం, ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు వెల్లడికానున్నాయి.

ఇది కూడా చదవండి:  తెలంగాణ ఎన్నికల్లో ఎన్ని వేల EVMలు వాడుతున్నారో తెలుస్తే షాక్ అవుతారు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు