TS Elections 2023: ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం.. కీలక అధికారిపై సస్పెన్షన్ వేటు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావుపై ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తిరుమల వెళ్లినందును ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 17 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావుపై ఈసీ సస్సెన్షన్ వేటు వేసింది. ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తో పాటు కలిసి ఎండీ తిరుమల వెళ్లారు. దీంతో టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఈసీ వివరణ కోరింది. అనంతరం మనోహర్‌రావును సస్పెండ్ చేసింది. ఓఎఎస్డీ సత్యనారాయణరావును విధుల నుంచి తొలగించింది. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజు విచారణ నిర్వహించిం ఈసీకి నివేదిక పంపించారు. ఈ నివేదిక ఆధారంగా మనోహర్ రావుపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. అధికారులు ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరంలేదని గతంలోనే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏ మాత్రం గీత దాటినా.. ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుండడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మంత్రులు, ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నేతల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. #election-commission-of-india #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి