TS New Cabinet: సీతక్కకు హోం, ఉత్తమ్ కు ఫైనాన్స్.. మంత్రివర్గంలో ఊహించని ట్విస్ట్ లు!

సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ హైకమాండ్.. మంత్రుల లిస్ట్ ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఉత్తమ్ కు ఫైనాన్స్, సీతక్కకు హోం మంత్రి ఇవ్వాలని నిర్ణయించిన అధిష్టానం.. మరో ముగ్గురికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
TS New Cabinet: సీతక్కకు హోం, ఉత్తమ్ కు ఫైనాన్స్.. మంత్రివర్గంలో ఊహించని ట్విస్ట్ లు!

త్వరలో ఏర్పడనున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ మంత్రివర్గం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని (Revanth Reddy) సీఎంగా డిసైడ్ చేసిన హైకమాండ్ సీనియర్లకు కీలక శాఖలు ఇవ్వడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ, సీతక్కను హోంమంత్రిగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో ఇద్దరు, ముగ్గురికి ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవులు ఇవ్వాలని కూడా హైకమాండ్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Telangana New CM: సీఎం ఫైనల్‌ రేసులో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌.. హైకమాండ్ ఎవరి వైపు?

ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా మంత్రివర్గం ఇలా ఉండే అవకాశం ఉంది..
1. రేవంత్‌రెడ్డి -సీఎం,
2. భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
3. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక మంత్రి
4. సీతక్క, హోంమంత్రి
5. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
6. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, విద్య, వైద్య ఆరోగ్య శాఖ
7. తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ
8. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలవనరుల శాఖ
9. కొండా సురేఖ, మహిళా, శిశు సంక్షేమ
10. దామోదర్‌ రాజనర్సింహ, పంచాయతీరాజ్‌ శాఖ
11.జూపల్లి కృష్ణారావు, పశు సంవర్థక శాఖ
12 జి.వివేక్‌, ఎస్సీ సంక్షేమం
13. సుదర్శన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
14. అద్దంకి దయాకర్‌, కార్మిక శాఖ
15.పొన్నం ప్రభాకర్‌, ఎక్సైజ్‌, బీసీ సంక్షేమ శాఖ
16.షబ్బీర్‌ అలీ, విద్యుత్‌ శాఖ మంత్రి
17.ప్రేమ్‌సాగర్‌రావు, గ్రామీణాభివృద్ధి శాఖ
18.మదన్‌మోహన్‌రావు, ఐటీ శాఖ మంత్రి

Advertisment
Advertisment
తాజా కథనాలు