TS Elections: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ డైరెక్ట్ అటాక్.. వాడో పిచ్చికుక్క, రైఫిల్ రెడ్డి అంటూ.. ఈ రోజు చేర్యాల మీటింగ్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. వాడో పిచ్చికుక్క.. తెలంగాణ ఉద్యమంపై రైఫిల్ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. ఉద్యమం సమయంలో ఆంధ్రావాళ్ల బూట్లు నాకాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Nikhil 18 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి చేర్యాలలో ఈ రోజు జరిగిన బీఆర్ఎస్ (BRS) ఎన్నికల మీటింగ్ లో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ పిచ్చికుక్క నిన్న జనగామకు వచ్చి పోయిందంటూ ధ్వజమెత్తారు. నిన్న మొరిగిన ఆ కుక్క రైఫిల్ పట్టుకుని ఎవడ్రా తెలంగాణ ఉద్యమం చేసేదంటూ నాడు కరీంనగర్ పైకి వెళ్లిందంటూ ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన పేరును ఆ రైఫిల్ రెడ్డిగా పెట్టారన్నారు. ఉద్యమం జరిగిన సమయంలో ఆంధ్రోళ్ల బూట్లు నాక్కుంటూ ఉన్నాడన్నారు. ఇది కూడా చదవండి: BREAKING: హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత.. అవన్నీ పొంగులేటి పైసలేనా? ఆనాడు మనమందరం ఉద్యమం చేస్తుంటే... ఆంధ్రోళ్ల బూట్లు మోసినోడు వచ్చి ఎట్లపడితే అట్లా మాట్లాడితే ఊకుందామా? ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్పాలె.. కాంగ్రెస్ ను బొందపెట్టాలె! - బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ 🔥🔥 #KCROnceAgain #VoteForCar pic.twitter.com/SbLzcJU8fx — BRS Party (@BRSparty) November 18, 2023 చంద్రబాబునాయుడుకు చెంచాగిరి చేసుకుంటూ ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటిది.. ఇప్పుడు వచ్చి తెలంగాణ ఉద్యమ కారులను, కేసీఆర్ ను తిట్టడం మర్యాదా? అని ప్రశ్నించారు. ఆయన కేసీఆర్ కు పిండం పెడతా అని అంటాడని.. ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయించాలని కోరారు. గెలిచే వాళ్లు ఇలాంటి మొరుగుడు చేయరని ధ్వజమెత్తారు. డిపాజిట్లు పోతయన్న భయం ఉన్న వారే ఇలాంటి మొరుగుడు చేస్తారని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ నేరుగా ఇంతలా అటాక్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఈ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఎలా కౌంటర్ ఇస్తారన్నది తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. #revanth-reddy #cm-kcr #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి