రైతుబంధుకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఈసీకి బీఆర్ఎస్ రిక్వెస్ట్! ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు చెల్లింపులకు మళ్లీ అనుమతించాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది. By V.J Reddy 27 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: తెలంగాణలో రాజకీయం మొత్తం రైతు బంధు (Rythu Bandhu) చుట్టే తిరుగుతూ ఉంది. ఎన్నికల వేళ రైతు బంధు, దళిత బంధు (Dalitha Bandhu) నిధులు విడుదల అనుమతి ఇవ్వొద్దు అంటూ గతంలో ఈసీకి (Election Commission) కాంగ్రెస్ (Congress) ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు (TS Elections) ముందు ఈ నగదు పంపిణీ చేయడం ద్వారా ప్రజలను ప్రలోభానికి గురవుతారని పేర్కొంది. కావాలంటే రైతు బంధును నవంబర్ 2వ తేదీకి ముందే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ALSO READ: BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్! ఇటీవల బీఆర్ఎస్ పార్టీ (BRS Party) రైతు బంధు నిధుల విడుదలకు అనుమతిని ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ ను కోరారు. ఈ నేపథ్యంలో ఈసీ రైతు బంధు నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు (Harish Rao) సోమవారం (28 నవంబర్) నాడు మీ మొబైల్ ఫోన్లు టింగ్ టింగ్ అంటూ రైతు బంధు డబ్బులు జమ అవుతాయని అన్నారు. మంత్రి హరీష్ రావు ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని తాజాగా ఈసీ రైతు బంధు నిధులకు బ్రేక్ వేసింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఇది కాంగ్రెస్ చేసిన పనే అంటూ ధ్వజమెత్తింది. ఇదిలా ఉండగా రైతుబంధు చెల్లింపులకు మళ్లీ అనుమతించాలని ఈసీని మరోసారి బీఆర్ఎస్ పార్టీ కోరింది. తాము ఎలాంటి ఉల్లంఘనలు చేయలేదని పేర్కొంది. రైతు బంధు కొత్త పథకం కాదని.. ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ప్రోగ్రాం అని పేర్కొంది. మరి బీఆర్ఎస్ పార్టీ విన్నపాన్ని ఈసీ అంగికరించి రైతు బంధు నిధుల విడుదలకు అనుమతిని ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన! #brs #congress #telangana-elections-2023 #telugu-latest-news #rythu-bandhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి