బోధన్ లో హై టెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల ఫైట్ నిజామాబాద్ జిల్లా బోధన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. . ఏడపల్లి మండలం సాటపూర్ గేట్ దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది. By Nikhil 22 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఏడపల్లి మండలం సాటపూర్ గేట్ దగ్గర ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ ఘర్షణ తలెత్తింది. దీంతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కారు దిగిన బీఆర్ఎస్ బోధన ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి కాంగ్రెస్ కార్యకర్తల వైపు దూసుకెళ్లారు. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే షకీల్ కారుపై దాడి జరగడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: TS Elections: టార్గెట్ తెలంగాణ.. ఆ మూడు రోజులు రాష్ట్రంలోనే మోదీ.. ఆ సీట్లపై స్పెషల్ ఫోకస్! ఇదిలా ఉంటే.. ఖమ్మంలో నిన్న అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం నగరానికి చెందిన మాజీ పోలీస్ అధికారి బోస్ ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు బోస్ ఇంట్లో భారీ మొత్తంలో నగదు దాచి ఉంచారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ మేరకు ఎన్నికల పర్యవేక్షణ అధికారులకు ఫిర్యాదు అందజేశారు. కాగా, అర్థరాత్రి వేళ బోస్ ఇంటి వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇది కూడా చదవండి: Telangana Jobs: ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇవీ లెక్కలంటూ వెబ్‌సైట్ రిలీజ్.. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు సైతం బోస్ ఇంటి వద్దకు భారీగా తరలి వచ్చారు. ఇరు వర్గాల మోహరింపుతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదు మేరకు బోస్ ఇంట్లో ఎన్నికల స్క్వాడ్ బృందాలు సోదాలు నిర్వహించాయి. బోస్ ఖమ్మం అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహించి ఇటీవలే వీఆర్ఎస్ తీసుకున్నారు. #brs #congress #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి