TS Elections: టార్గెట్ తెలంగాణ.. ఆ మూడు రోజులు రాష్ట్రంలోనే మోదీ.. ఆ సీట్లపై స్పెషల్ ఫోకస్! తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా పీఎం మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు. పార్టీకి గట్టి పట్టు ఉన్న దుబ్బాక, కరీంనగర్, మహబూబాబాద్, నిర్మల్, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ప్రధాని పర్యటన ఉండేలా ప్లాన్ చేసింది బీజేపీ. By Nikhil 22 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) సత్తా చాటాలని భావిస్తోన్న బీజేపీ (BJP) తన అగ్రనాయకత్వాన్ని రంగంలోకి దించుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఏకంగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను ఖారారు చేసింది రాష్ట్ర నాయకత్వం. ఈనెల 25వ తేదీన కామారెడ్డి, రంగారెడ్డిలో ప్రధాని ప్రచారం చేయనున్నారు. 26వ తేదీన దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొంటారు. 27న మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్లతో పాటు హైదరాబాద్ లో రోడ్డు షో పాల్గొంటారు. 25న రాత్రి రాజ్ భవన్ లో బస చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు సభలో పాల్గొంటారు. ఆ సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:05 గంటలకు రంగారెడ్డి జిల్లాకు చేరుకుంటారు. సాయంత్రం 4:15 గంటల నుంచి 4:55 గంటల వరకు నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఇది కూడా చదవండి: TS Elections 2023: తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా! అక్కడి నుంచి బయలుదేరి 7:35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఆ రోజు రాజ్ భవన్ లోనే బస చేయనున్నారు ప్రధాని. 26వ తేదీన దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొంటారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు వెళ్తారు. 2:15 గంటల నుంచి 2:45 వరకు దుబ్బాకలో నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో మోదీ పాల్గొంటారు. ఇది కూడా చదవండి: Telangana Jobs: బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు ఇవే.. పూర్తి లెక్కలతో వెబ్‌సైట్.. ఆ సభ అనంతరం నిర్మల్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:45 గంటల నుంచి సాయంత్రం 4:25 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి బయలుదేరనున్నారు. 27న మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్, హైదరాబాద్ లో రోడ్డు షోలో పాల్గొంటారు. 27న తిరుపతి నుంచి బయలుదేరి 11:30 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 1:25 గంటల వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ సభ అనంతరం నేరుగా కరీంనగర్ బయలుదేరనున్నారు. 2:45 గంటల నుంచి 3:25 గంటల వరకు కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40కి హైదరాబాద్ కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోదీ పాల్గొంటారు. విమానాశ్రయం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. రోడ్ షో అనంతరం నేరుగా హైదరాబాద్ నుంచి 6:25 గంటలకు ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. #bjp #modi #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి