T Congress : స్పీడ్ పెంచిన టీకాంగ్రెస్.. అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం! T Congress MLA Candidates List :ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఎన్నికలపై చర్చించేందుకు గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్దిక్, మేవాని ఈ సమావేశంలో పాల్గొన్నారు. By BalaMurali Krishna 14 Aug 2023 in రాజకీయాలు హైదరాబాద్ New Update షేర్ చేయండి T Congress MLA Candidates List :తెలంగాణ కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్లు ప్రత్యేక కార్యాచరణతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్దిక్, మేవాని పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలతో పాటు కేసీఆర్ (KCR)సర్కార్‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై మంతనాలు జరుపుతున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చిస్తున్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగొలు సర్వేతో పాటు వివిధ సర్వే నివేదికలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఎన్నికల కమిటీ సూచించిన అభ్యర్థులపై మరోసారి స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి దశ అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమవుతోంది. తొలి దశ జాబితాలను హైకమాండ్‌కు పంపంచి తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ(BJP) కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించే దిశగా కార్యాచరణ రెడీ చేస్తున్నారు. మరోవైపు గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో సమావేశమైన ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బృందం సమావేశమైంది. ఎస్సీలలో ఏ,బీ,సీ,డీ విభజన విషయంలో చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు అందజేసింది. Your browser does not support the video tag. Your browser does not support the video tag. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేరిన వారికి స్వాగతం చెబుతున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని.. హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాలు కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని.. ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకోవడానికి కాదన్నారు. పేదలకు కాంగ్రెస్ పట్టా భూములు ఇస్తే.. అభివృద్ధి ముసుగులో బీఆరెస్ గుంజుకుంటోందని మండిపడ్డారు. రూ.100కోట్లు పలికే భూములకు ఎకరానికి కోటి అయినా పేదలకు ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. ఔటర్ పక్కన రూ.65వేల కోట్ల విలువైన భూమి ఉందన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని పోలీసులకు చెబుతన్నానన్నారు. రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతున్నామని.. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌కు తన నాయకత్వంపై నమ్మకముంటే... గజ్వేల్ నుంచి పోటీ చేయాలని.. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలని సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపించండని కోరారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తమది అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. అందుకే అన్ని ఆస్తులు అమ్ముకుని కేసీఆర్ విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సొంత మనుషులకు అప్పగించేందుకే వైన్ షాపులకు ముందే టెండర్లు వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ టెండర్లు వేస్తామన్నారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టడానికి జాగా లేదన్న కేసీఆర్... వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. భూములు కొన్నవారు జాగ్రత్త... ఆలోచించి నిర్ణయం తీసుకోండని సూచించారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని హెచ్చరించారు. Also Read: కామారెడ్డి జిల్లాకు విదేశీ పరిశ్రమలు తీసుకొస్తాం #revanth-reddy #congress-party #t-congress-candidates-list #t-congress-mla-candidates-list #congress-mla-list #congress-mla-candidates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి