Telangana Elections: సింగరేణి విషయంలో అది నిజం కాదా? సీఎం కేసీఆర్‌పై రేవంత్ సంచలన కామెంట్స్..

సింగరేని సంస్థ బాగుపడాలంటే మంచి యాజమాన్యం, మంచి ప్రభుత్వం ఉండాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్‌ 3న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. గురువారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 1వ గనిలో గేట్ మీటింగ్‌లో పాల్గొన్న టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.

New Update
Telangana Elections: సింగరేణి విషయంలో అది నిజం కాదా? సీఎం కేసీఆర్‌పై రేవంత్ సంచలన కామెంట్స్..

Telangana Elections: కాంగ్రెస్‌ను గెలిపిస్తే సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి(Revanth Reddy). సింగరేణి లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదన్నారు. అలాంటి కార్మికులను ఇవాళ కేసీఆర్(CM KCR) నట్టేట ముంచారని విమర్శించారు. సింగరేణిని(Singareni) నాశనం చేసే గనుల ప్రైవెటైజేషన్‌ బిల్లుకు కేసీఆర్‌, ఆయన కూతురు కవిత మద్దతు తెలిపింది నిజం కాదా అని ప్రశ్నించారు. సంస్థ బాగుపడాలంటే మంచి యాజమాన్యం, మంచి ప్రభుత్వం ఉండాలన్నారు. సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్‌ 3న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నారు రేవంత్‌రెడ్డి. గురువారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 1వ గనిలో గేట్ మీటింగ్‌లో పాల్గొన్నారు టీపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మధు యాష్కీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని, ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు.

పదేళ్లుగా చూస్తున్నాం..

పదేళ్లుగా సింగరేణి కార్మికులను కేసీఆర్ ఎలా మోసం చేస్తున్నారో దగ్గరుండి చూస్తున్నాని చెప్పారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. గత ఎన్నికల్లో కవితతో కలిసి తాను ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మాటలు చెప్పి బతకడమే తప్ప బీఆర్‌ఎస్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు పొంగులేటి.

తెలంగాణ సర్కార్‌పై సీతక్క ఫైర్..

రాహుల్ గాంధీ ర్యాలీకి కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. రాహుల్‌తో ములుగు పర్యటనలో ఉన్న ఆమె.. తెలంగాణ సర్కారుపై నిప్పులు చెరిగారు. పదవులన్నీ అనుభవించి ఇవాళ అదే పార్టీపై పొన్నాల లక్ష్మయ్య పలచని వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఎవరెన్ని మాట్లాడినా ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉన్నారన్నారు ఎమ్మెల్యే సీతక్క.

కాంగ్రెస్ బస్సు యాత్రతో కేసీఆర్ పతనం ప్రారంభం..

కాంగ్రెస్ బస్సు యాత్రతో కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. డిసెంబర్‌3న వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారు. ములుగు జిల్లాలో రాహుల్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాము అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై చర్యలు చేపడుతామన్నారు.

ఇదికూడా చదవండి:

విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..

దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..

Advertisment
Advertisment
తాజా కథనాలు