CM Revant Reddy: సీతక్క ఇలాకా ములుగులో కంపెనీ.. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష!

ములుగు జిల్లా కమలాపురంలోని బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మిల్లును పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాల గురించి పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2014లో ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.

New Update
CM Revant Reddy: సీతక్క ఇలాకా ములుగులో కంపెనీ.. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష!

CM Revant Reddy: ములుగు జిల్లా కమలాపురంలోని బల్లాపూర్ ఇండస్ట్రీస్ (Ballapur Industries) లిమిటెడ్ మిల్లు ( Built)ను పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revant Reddy) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం సీఎం ఉన్నతాధికారులు, ఫిన్ క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్(FinQuest Financial Solutions) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ హార్దిక్ పటేల్ (Hardik Patel), ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈవో వాదిరాజ్ కులకర్ణితో సమావేశం అయ్యారు. ప్రస్తుతం బిల్ట్ ఆస్తులు ఫిన్ క్వెస్ట్ సంస్థ ఆధీనంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో బిల్ట్ మిల్లును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు.

2014లోనే మూతపడిన మిల్లు:
ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారీ చేస్తారు. 2014లోనే ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించటంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపారు.నేషనల్ కంపెనీ లా ట్రిబున్యల్ తీర్పు ప్రకారం ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధీనంలో ఉన్నాయి. ఆ కంపెనీ ఎండీ హార్దిక్ పటేల్‌, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈవో వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సెక్రెటేరియట్లో సోమవారం సమావేశమయ్యారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ఆలోచనను వారితో పంచుకున్నారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు.

ఐటీసీ కంపెనీ ఆసక్తి:
మిల్లును తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్‌క్వెస్ట్ బృందాన్ని కోరారు. బిల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెనీ ఆసక్తి చూపుతోందన్నారు. ఫిన్ క్వెస్ట్ కంపెనీ ఐటీసీ తో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కోరారు. బిల్ట్ మిల్లును పునరుద్ధరించే ప్రక్రియలో ఐటీసీకి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2015, 2018లో ప్రోత్సాహకాలను పొడిగించి, మూతపడ్డ ఈ యూనిట్‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇది కూడా చదవండి: అంగన్వాడీల ఆందోళనల్లో రాజకీయ కోణం.. వారికి జీతాలు పెంచడం కుదరదు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు