/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-REVANTH-REDDY--jpg.webp)
CM Revanth Reddy : తెలంగాణ(Telangana) అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన దూసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొత్త డిజిటల్ కార్డులపై కసరత్తు చేస్తున్నట్లు దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి: AP Elections: ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం!
అదే నా లక్ష్యం: సీఎం రేవంత్
దావోస్‌లో వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(World Economic Forum) సదస్సులో నిర్వహించిన ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’(Digital Health Card) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్ సేవలకు రాజధానిగా హైదరాబాద్(Hyderabad) నగరం ఉంది. కానీ.. నాణ్యమైన వైద్య సేవలు పొందాలంటే దానికి భారీగా ఖర్చు అవుతోంది. ప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలనేదే నా లక్ష్యం. తమ రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బెస్ట్ టెక్నాలజీ సాయంతో నాణ్యమైన వైద్యసేవలు ఉచితంగా అందిస్తాం. డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతుంది. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి’’ అని సీఎం రేవంత్ మాట్లాడారు.
తెలంగాణకు రూ.37,870 కోట్ల పెట్టుబడులు..
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు రూ.37,870 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. రేవంత్ రెడ్డి ఇంకా స్విట్జర్లాండ్‌లోనే ఉన్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు చర్చలు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఈ పెట్టుబడులు అన్నీ వచ్చాయి.
ఇది కూడా చదవండి: మహిళలకు ఉచిత ప్రయాణం ఆగిపోనుందా? హైకోర్టులో దాఖలైన పిల్
DO WATCH: