Kaleshwarm Project: రూ. 50 వేల కోట్లు బొక్కిన మేఘా కృష్ణా రెడ్డి.. సీబీఐ విచారణ? కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 50 వేల కోట్ల కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి బొక్కేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రతిపక్షంలో ఉండి సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నిస్తున్నారు. By Shiva.K 30 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kaleshwarm Project: తెలంగాణలో ఇప్పుడంతా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి(Kaleshwaram Corruption)పై బిగ్ డిస్కషన్ నడుస్తోంది. మీడియాలో, సోషల్ మీడియాలో, పొలిటికల్ పార్టీల్లో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మొదలు.. నిర్మాణం పూర్తి అయిన తరువాత కూడా ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల మేడిగడ్డ(Medigadda Barrage) బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడంతో ఈ ఆరోపణలు మరింత పీక్స్‌కు చేరాయి. అయితే, బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్(Congress) నేతలు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అప్పటి పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనేకసార్లు లేఖలు కూడా రాశారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో ప్రజల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందా? అవినీతిపై ఏ నిర్ణయం తీసుకుంటుందా? అని ఎదురు చూస్తూ వచ్చారు. అందరూ అనుకున్నట్లుగానే.. కాంగ్రెస్ నేతలు విపక్షంలో ఉన్నప్పుడు చేసిన తీవ్ర అవినీతి ఆరోపణలకు కొనసాగింపుగా శుక్రవారం నాడు ఐదుగురు మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పిల్లర్‌ను పరిశీలించారు మంత్రులు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు భారీ అవినీతి జరిగిందని, ప్రాజెక్టులో భాగమైన 3 బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయని ఆరోపించారు. ప్రాజెక్టు విషయంలో బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరినీ వదలబోమని స్పష్టం చేశారు. న్యాయ విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సీబీఐ విచారణ డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు ఆ ప్రస్తావన తీసుకురావడం లేదని ప్రశ్నించారు. న్యాయ విచారణ కాకుండా.. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేఘా కృష్ణా రెడ్డిపై (Megha Krishna Reddy) రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేస్తున్నారు. సీబీఐ (CBI) విచారణ కోరుతూ లేఖలు సైతం రాశారన్నారు. ఈ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు మేఘా కృష్ణా రెడ్డి కొట్టేశారని ఆరోపించారని, ఇప్పుడు కనీసం కాంట్రాక్టర్ పేరు కూడా ఎత్తడం లేదని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. నాడు అన్ని ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు విచారణ చేయించడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రక్టర్ మేఘా కృష్ణా రెడ్డి దాదాపు రూ. 50 వేల కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారన్న కాంగ్రెస్ నేతల విమర్శలను ప్రస్తావిస్తున్నారు. మరి సీబీఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేతలు. Also Read: దూర ప్రయాణం చేస్తున్నారా? వీటిని పాటిస్తే ఏ సమస్యా ఉండదు..! సామాన్యుడికి ఇంటికి ప్రధాని మోదీ.. ఓ కప్పు టీ తాగి సరదాగా ముచ్చట్లు.. #telangana #megha-krishna-reddy #kaleshwaram-lift-irrigation-project #kaleshwaram-corruption #kaleshwarm-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి