Telangana BJP: బీజేపీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ బహిష్కరణ.. కారణం ఆయనేనట..!

తెలంగాణ బీజేపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సభకు డుమ్మా కొట్టారు. అక్బరుద్దీన్ ముందు తాము ప్రమాణ స్వీకారం చేయలేమన్నారు. సీనియర్లను కాదని అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం ఇవ్వడాన్ని తప్పుపట్టారు.

New Update
Telangana BJP: బీజేపీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ బహిష్కరణ.. కారణం ఆయనేనట..!

Telangana BJP Leaders: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. శాసనసభలో ఇవాళ తాము ప్రమాణ స్వీకారం చేయబోమని స్పష్టం చేశారు కమలం పార్టీ ఎమ్మెల్యేలు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎన్నుకోవడమే.. బీజేపీ నేతలు బహిష్కరణకు కారణంగా చెబుతున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ ముందు తాము ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసే ముచ్చటే లేదని తేల్చి చెప్పారు బీజేపీ ప్రజా ప్రతినిథులు. ఈ మేరకు ఇవాళ పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేఎల్పీ భేటీలో నిర్ణయించారు. బీజేఎల్పీ మీటింగ్‌కు ముందు.. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు బీజేపీ ఎమ్మెల్యేలు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అటు తరువాత పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

అయితే, అంతకు ముందు అసెంబ్లీకి హాజరవడంపై బీజేపీ ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శాసనసభకు వెళ్లాలా? వద్దా? అని సందిగ్ధంలో ఉన్నారు. కొందరు సభకు వెళ్దామని ప్రతిపాదించగా.. ఎమ్మెల్యే రాజా సింగ్ అసంతృప్తితో విడిగా వెళ్లిపోయారు. తాను అసెంబ్లీకి రానని కరాఖండీగా తేల్చి చెప్పారు. బీజేఎల్పీ మీటింగ్ తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి పార్టీ ఎమ్మెల్యేలంతా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే, ఈ పూజా కార్యక్రమంలో రాజాసింగ్ పాల్‌గొనలేదు.

కాంగ్రెస్ తీరు కూడా అలాగే ఉంది..

కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శాసనసభా గౌరవాన్ని కాలరాసేలా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సభలో సీనియర్ సభ్యులు ఉన్నా వారందరినీ కాదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకున్నారని ఆరోపించారు. ఎంఐఎంతో ఒప్పందంలో భాగంగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని ఆరోపించారు కిషన్ రెడ్డి. సభ నియమాలను తుంగలో తొక్కడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అందుకే ఇవాళ అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం ఒకటేనన్న కాంగ్రెస్.. ఇప్పుడు అక్బరుద్దీన్ ను ప్రొటెంస్పీకర్ గా ఎలా నియమించిందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నియమించి ఆయన ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నిక జరగాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ ను కలిసి కోరుతామన్నారు కిషన్ రెడ్డి.

Also Read:

కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..!

కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు