Telangana New CM: సీఎం ఫైనల్ రేసులో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్.. హైకమాండ్ ఎవరి వైపు? తెలంగాణ సీఎం ఎవరన్న అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా తేల్చలేదు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత చీఫ్ రేవంత్ రెడ్డి ఫైనల్ రేసులో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సాయంత్రం లోగా వీరిలో ఒకరి పేరును హైకమాండ్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. By Nikhil 05 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ సీఎం (Telangana CM) అభ్యర్థిపై ఢిల్లీలో చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఫైనల్ రేసులో టీపీసీసీ ప్రస్తుత చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy), మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. మల్లిఖార్జున ఖర్గేతో చర్చల తర్వాత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వెళ్లిపోగా... ఆ తర్వాత ఖర్గేతో కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ మంతనాలు జరిపారు. అయితే.. ఈ సమావేశం ముగిసినా సీఎం అభ్యర్థి ఎవరనేది తేలలేదు. ఉత్తమ్‌తోనూ పార్టీ పెద్దలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే.. అధిష్టానం నిర్ణయం ఏంటనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సాయంత్రమే సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికలో బిగ్ ట్విస్ట్.. డీకే ఇంటికి వైసీపీ ఎంపీ.. అసలేం జరుగుతోంది? రేవంత్ రెడ్డి పేరును ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉత్తమ్, రేవంత్ మధ్య గత ఎన్నికల సమయం నుంచే వైరం నడుస్తోంది. ఉత్తమ్ రాజీనామాతో వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి పద్మావతికి టికెట్ ఇవ్వాలని కోరుతున్న సమయంలో.. తన అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనను రేవంత్ హైకమాండ్ వద్ద ఉంచడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఉత్తమ్ ఆరోపణలు చేశారు. సూర్యాపేట టికెట్ ను రేవంత్ తన అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డికి ఇప్పించాలని ప్రయత్నించగా.. ఉత్తమ్ మాత్రం పట్టుబట్టి దామోదర్ రెడ్డికి టికెట్ వచ్చేలా చక్రం తిప్పారు. తాజాగా సీఎం రేసులో ఈ ఇరువురు నేతల మధ్య మరో సారి వార్ సాగుతోంది. #telangana-elections-2023 #uttam-kumar-reddy #tpcc-chief-revanth-reddy #mp-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి