Nalgonda Politics: చక్రం తిప్పిన కోమటిరెడ్డి.. కాంగ్రెస్ ఖాతాలోకి నల్గొండ మున్సిపాలిటీ! నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై కాంగ్రెస్ కౌన్సెలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఇప్పటివరకు చైర్మన్ గా పని చేసిన మందడి సైదిరెడ్డి తన పదవిని కోల్పోయారు. నల్గొండ కొత్త మున్సిపల్ చైర్మన్ గా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. By Nikhil 08 Jan 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ (Congress) ఖాతాలో చేరేలా ఆయన రచించిన వ్యూహం ఫలించింది. బీఆర్‌ఎస్ (BRS) చైర్మన్‌కు వ్యతిరేకంగా 41 ఓట్లు, బీఆర్‌ఎస్ చైర్మన్‌కు అనుకూలంగా కేవలం ఐదు ఓట్లు వచ్చాయి. నల్గొండ మున్సిపాల్టీలో మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున 20 మంది, కాంగ్రెస్ నుంచి 20, బీజేపీ తరఫున ఆరుగురు, ఎంఐఎం నుంచి ఒకరు కౌన్సిలర్లుగా గెలిచారు. కాంగ్రెస్ కౌన్సిలర్ మృతితో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. మరో కాంగ్రెస్ కౌన్సిలర్ బీఆర్‌ఎస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్ బలం 22కు చేరింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో 9 మంది కౌన్సిలర్లు చేరారు. ఇది కూడా చదవండి: TS Govt Jobs : ఆ ఉద్యోగ ఖాళీల భర్తీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు! ఎన్నికల తర్వాత మరో ఆరుగురు కౌన్సిలర్లు సైతం హస్తం గూటికి చేరారు. బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల చేరికతో కాంగ్రెస్ బలం 34కు చేరింది. దీంతో 34 మంది కౌన్సిలర్ల మద్దతుతో ఛైర్మన్‌పై కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టింది. అశ్వాసం సమయంలో కాంగ్రెస్‌కు మరి కొంతమంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. అవిశ్వాసం నెగ్గడంతో ఇప్పటివరకు చైర్మన్ గా ఉన్న మందడి సైదిరెడ్డి తన పదవిని కోల్పోయారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్లలో ఒకరిని ఛైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: Rythu Bandhu : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఇవాళ్టి నుంచి అకౌంట్లలోకి రైతుబంధు మంత్రి కోమటిరెడ్డి చైర్మన్ గా ఎవరికి అవకాశం కల్పిస్తారన్న అంశం నల్గొండలో ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా పదవి కోల్పోయిన మందడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా.. అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో వందల కోట్లతో మున్సిపాలిటీని అభివృద్ధి చేశానన్నారు. అవినీతి చేస్తే అవిశ్వాస తీర్మానం పెట్టాలి కానీ.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై అవిశ్వాసo పెట్టారని ఫైర్ అయ్యారు. కొందరు కౌన్సిలర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ ఉంటారన్నారు. డబ్బుకు అమ్ముడుపోయిన వారు మళ్లీ ఎలా ప్రజలకు న్యాయం చేస్తారో పట్టణ ప్రజలు ఆలోచించాలని కోరారు. విప్ ను ధిక్కరించి.. కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. తాము రాజకీయ విలువలు పాటించి ఆనాడు బొడ్డుపల్లి లక్ష్మి ను దింపలేదని గుర్తు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇలాంటి రాజకీయాలు తగదన్నారు. ఆయన MLA, మంత్రిగా ఉన్న 20 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేయలేదన్నారు. కనీసం ఇప్పుడైనా నల్లగొండ అభివృద్ధి మీద కోమటిరెడ్డి ఫోకస్ పెట్టాలన్నారు. కుట్రలు కుతంత్రాలతో సొంత పార్టీకి అన్యాయం చేసిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలని కలెక్టర్ ను కోరనున్నట్లు చెప్పారు సైదిరెడ్డి. #komatireddy-venkatreddy #nalgonda-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి