Budget Mobile: రూ.8,099కే అదిరే స్మార్ట్‌ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని రోజులు స్టాండ్‌బై ఉంటుందో తెలుసా?

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తునే ఉండగా..గతవారం రిలీజైన ఐటెల్ పీ40 ప్లస్‌ అమెజాన్‌లో 19 శాతం డిస్కౌంట్‌తో రూ.8,099కే లభిస్తోంది. EMI ఆప్షన్ ద్వారా నెలకు రూ.387కి చెల్లింపు ధరలో కూడా అందుబాటులో ఉంది.

New Update
Budget Mobile: రూ.8,099కే అదిరే స్మార్ట్‌ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని రోజులు స్టాండ్‌బై ఉంటుందో తెలుసా?

ప్రస్తుతం 10వేల రూపాయలలోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్లు కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే కనీసం రూ.12వేలు పెడితే కానీ మంచి స్మార్ట్‌ఫోన్‌ రాదన్న నమ్మకం వినియోగదారుల్లో కనిపిస్తోంది. అయితే ఇది తప్పు.. మన అవసరానికి తగ్గట్టుగా స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు చూసుకోవాలని కానీ ఇంత పెడితేనా మంచిది అన్న అభిప్రాయం కరెక్ట్ కాదు. ఇక ప్రస్తుతం మార్కెట్‌లో లో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్స్‌పై డిస్కౌంట్లు నడుస్తున్నాయి. వారం క్రితం లాంచ్ అయిన ఐటెల్ పీ40 ప్లస్‌పై ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌లో డిస్కౌంట్‌ ప్రైజ్‌కి సేల్ అవుతుంది. ఈ మొబైల్ అసలు ధర రూ.9,999 ఉండగా.. దీనిపై అమెజాన్‌లో 19 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.8,099కి అమ్ముతున్నారు. EMIలో రూ.387కే లభిస్తోంది.

ఐటెల్ పీ40 ప్లస్ స్పెసిఫికేషన్లు:
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.8 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్ కూడా అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. ఉపయోగించని స్టోరేజ్ నుంచి మరో 4 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌కి 13MP ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (AI) కెమెరా ఉంది. 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ 7,000mAh పవర్ కలిగివుంది. దీన్ని 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్ ద్వారా త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. 4 రోజులు ఛార్జింగ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీనికి ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్ - ఫోర్స్ బ్లాక్ ఉన్నాయి. స్క్రీన్ రిజల్యూషన్ 720x1640గా ఉంది. ఈ 13 వెర్షన్‌తో పనిచేస్తుంది. ఇది 4G LTE, 3G, 2G సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5G లేదు. ఈ మొబైల్ స్క్రీన్‌ను 100 రోజుల్లో ఒకసారి ఫ్రీగా రీప్లేస్ చేయించుకోవచ్చు. ఈ ఫోన్ డైమెన్షన్స్ చూస్తే.. ‎16.4 x 7.6 x 0.9 సెంటీమీటర్లు ఉంది. 224 గ్రాముల బరువు ఉంటుంది. ఈ మొబైల్‌ని బ్లూటూత్, వైఫై, USB ద్వారా కనెక్ట్ చెయ్యవచ్చు. ఆడియో జాక్ 3.5 mm ఉంది. ఈ ఫోన్ బాక్సులో హ్యాండ్ సెట్, చార్జర్, USB కేబుల్, సిమ్ ఇజెక్టర్ టూల్, యూజర్ గైడ్, వారంటీ కార్డ్ ఇస్తారు. దీన్ని ఇండియాలోనే ‎S మొబైల్ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారుచేస్తోంది.

గతంలో పీ40కూడా లో బడ్జెట్‌లో విడుదల:

ఐటెల్ పీ40 ప్లస్‌కి ముందు గత మార్చిలో ఐటెల్ పీ40 రిలీజ్ అయ్యింది. ఇది కూడా లో బడ్జెట్‌ క్యాటగీరిలోనే విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్‌లలో లభిస్తోంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఐటెల్ పీ40 ఫోన్ ధర రూ. 7,699గా ఉంది. ఐటెల్ పీ40 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌పై నడుస్తుంది 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6 అంగుళాల హెచ్డీ + ఐపీస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఫోన్ డిస్‌ప్లేలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ గరిష్టంగా 4GB ర్యామ్ ఆక్టా-కోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ఇది 3జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌కు కూడా మద్దతునిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. దీని ప్రైమరీ కెమెరా 13ఎంపీ. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 5ఎంపీ కెమెరా ఉంది. అటు ఈ ఫోన్ బ్యాటరీ విజయానికి వస్తే.. ఇది 6,000mAh సామర్థ్యంను కలిగి ఉంటుంది. అయితే ప్రస్తుతం రిలీజైన ఐటెల్ పీ40 ప్లస్‌ 7,000mAhతో రిలీజ్‌ అయ్యింది. అంటే ఛార్జింగ్‌ ఎంత సేపు ఎక్కువ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు