Teeth : ఇలా చేస్తే మీ పళ్లు నిగనిగలాడతాయి.. దంత సమస్యలకు చెక్!

మీ పళ్లు తెల్లగా నిగనిగలాడాలంటే సిగరేట్‌ జోలికి పోవద్దు. కాఫీ, టీ, రెడ్ వైన్ లాంటివి తాగినప్పుడు వెంటనే నోటిని ఫ్లాష్‌ చేయండి. మీ దంతాలను రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ముఖ్యం. శాశ్వత ఫలితాల కోసం దంతవైద్యుడిని సంప్రదించండి.

New Update
Teeth : ఇలా చేస్తే మీ పళ్లు నిగనిగలాడతాయి.. దంత సమస్యలకు చెక్!

Teeth Tips : పళ్లు(Teeth) అందంగా ఉంటే ముఖం అందం(Face Beauty) గా కనిపిస్తుంది. మనం నవ్వినప్పుడు బయట పడేది మన పళ్లే. అందుకే అవి క్లీన్‌గా ఉండాలి. పళ్లు అందంగా కనిపించడానికి చాలా మంది వివిధ రకాల టూత్‌ పెస్టులు(Tooth Paste) వాడుతుంటారు. అయితే మార్కెట్‌లోకి వచ్చే టూత్‌ పెస్టులన్ని నమ్మడం లేదు. అందుకే పళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నెచురల్‌ టిప్స్‌(Natural Tips) ఫాలో అవ్వండి. మీ పళ్లను తెల్లగా నిగనిగలాడే చిట్కాలపై ఓ లుక్కేయండి.

Teeth Tips ప్రతీకాత్మక చిత్రం

నోటి పరిశుభ్రతను: మీ దంతాలను క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లాష్ చేయడం వల్ల మరకలు రాకుండా ఉంటాయి. దీంతో ఆరోగ్యకరమైన చిరునవ్వు మీ సొంతం అవుతుంది.

ఆహారం, ఫ్లూయిడ్స్‌ మరకలను నివారించండి: కాఫీ, టీ, రెడ్ వైన్, బెర్రీలు లాంటి వాటి వినియోగాన్ని పరిమితం చేయండి. ఎందుకంటే అవి మీ దంతాలను మరక చేస్తాయి.

స్ట్రా ద్వారా తాగండి: దంతాలను మరక చేసే పానీయాలు(Drinks) తాగేటప్పుడు, స్ట్రాను ఉపయోగించడం వల్ల మీ దంతాలతో వాటిని టచ్‌ అవ్వనివ్వకుండా చేయవచ్చు.

ధూమపానం మానేయండి: ధూమపానం(Smoking) వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. సిగరేట్‌ మానేయడం మీ దంతాల రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

టూత్‌పేస్ట్ ఉపయోగించండి: టూత్‌పేస్ట్ పళ్ల మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.

మీరు కాఫీ, టీ, దుంపలు, లేదా వైన్ లాంటి కలిగిన ఆహారాన్ని తిన్నప్పుడల్లా లేదా తాగినప్పుడు, మీ దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. అందుకే ఇవి తాగిన తర్వాత నోటిని ఫ్లాష్‌ చేయడం ముఖ్యం.

ఉప్పు, ఆవ నూనె:
ఉప్పులో ఆవాల నూనె కలపడం వల్ల దంతాలపై ఉన్న పసుపు గారా తొలగిపోతుంది. దీని కోసం, అర టీస్పూన్ ఉప్పులో కొన్ని చుక్కల ఆవాల నూనెను కలిపి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను దంతాల మీద రుద్దండి. చివరగా, నీటితో శుభ్రం చేయండి. ఇలా చేస్తే 15 రోజుల్లో దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి.

శాశ్వత ఫలితాల కోసం దంతవైద్యుడిని సంప్రదించండి.

Also Read : రివ్యూ రూల్‌లో మార్పు.. కొత్త సిస్టమ్‌పై ఓ లుక్కేయండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు