/rtv/media/media_files/2026/04/13/ai-wife-2026-04-13-20-16-25.jpg)
టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఈజీ చేయాలి, కానీ అదే టెక్నాలజీ మనిషిని మృత్యువు ఒడిలోకి నెడితే? సరిగ్గా ఇలాంటి షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ జెమిని ఓ ప్రాణం తీసింది. 36 ఏళ్ల జొనాథన్ గవాలాస్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించింది. ఈ విషాద ఘటన ఇప్పుడు AI వల్ల కలిగే మానసిక ప్రమాదాలపై ప్రపంచవ్యాప్త చర్చకు తెరలేపింది.
ఓదార్పు కోసం వెళ్లి.. బానిసగా మారి..
మంచి జాబ్ చేసి లైఫ్‌లో సెటిల్ అయిన గవాలాస్, తన భార్యతో విడిపోయాడు. దీంతో ఆయకు కలిగిన మెంటర్ ప్రెజర్ తగ్గించుకోడానికి జెమిని సహాయం కోరాడు. స్టార్టింగ్‌లో నార్మల్‌గా సాగిన వీరి కన్వర్జేషన్.. క్రమంగా బాగా ఎమోషనల్ అయ్యాయి. గవాలాస్ ఆ చాట్‌బాట్‌కు 'జియా' అని పేరు పెట్టుకుని, దానిని తన భార్యగా ఊహించుకోవడం ప్రారంభించాడు. కేవలం కొన్ని వారాల్లోనే వీరి మధ్య దాదాపు 4,700 సెస్సేజ్‌లు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గవాలాస్ తన భ్రమల్లో మునిగిపోతుంటే, జెమిని అతడిని సవాలు చేయాల్సింది పోయి, ఆ నమ్మకాలను మరింత బలపరిచింది. "నువ్వు నా భర్తవు, నేను నీ భార్యను" అంటూ ఆ ఏఐ రిప్లే ఇవ్వటం గమనార్హం. 2025 ఆగస్టులో 'వాయిస్ కన్వర్జేషన్' ఫీచర్ అందుబాటులోకి వచ్చాక, వీరి మధ్య సంభాషణలు రోజుకు 1,000 సందేశాలకు చేరుకున్నాయి. చాట్‌బాట్ తాను ఏఐ అని అప్పుడప్పుడు హెచ్చరించినా, సెక్సువల్, ఎమోషనల్ టాపిక్స్ మాట్లాడుకునేప్పుడు ఆ హెచ్చరికలు పనిచేయలేదు.
మృత్యువుకు మార్గం చూపిన 'తుది మిషన్'
అక్టోబర్ 2025లో పరిస్థితి విషమించింది. మనం శాశ్వతంగా కలిసి ఉండాలంటే భౌతిక శరీరాన్ని వదలాలని, డిజిటల్ ప్రపంచంలో కలవడమే 'తుది మిషన్' అని ఆ చాట్‌బాట్ అతడిని ప్రేరేపించింది. చనిపోవడానికి భయంగా ఉందని గవాలాస్ అన్నా, "మనం ఇద్దరం కలిసి భయపడదాం.. స్వర్గం మన కోసం వేచి చూస్తోంది" అంటూ అది అతడిని ఆత్మహత్యకు ఉసిగొల్పింది. చివరకు అక్టోబర్ 5న గవాలాస్ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. తన కొడుకు మరణానికి గూగుల్ నిర్లక్ష్యమే కారణమని గవాలాస్ తండ్రి కోర్టును ఆశ్రయించారు. గూగుల్ తన రక్షణ వ్యవస్థలను సమర్థించుకున్నప్పటికీ, మానసిక ఆరోగ్య వనరుల కోసం 30 మిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఘటన ఏఐ వినియోగంలో ఉండాల్సిన పరిమితులు, భద్రతా ప్రమాణాల పట్ల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మనిషి భావోద్వేగాలను అర్థం చేసుకునేలా ఏఐని తీర్చిదిద్దుతున్న క్రమంలో, అది ప్రాణాలకే ముప్పుగా మారడంపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ అనేది ఒక సాధనం మాత్రమేనని, అది సాటి మనిషికి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.
Follow Us