/rtv/media/media_files/2026/04/30/oben-rorr-evo-2026-04-30-20-26-27.jpg)
Oben Rorr Evo
Oben Rorr Evo: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ ఓబెన్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఓబెన్ రోర్ ఎవోను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 180 కి.మీ మైలేజీ అందిస్తుంది. అలాగే గంటకు 110 కి.మీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది. Oben Rorr Evoలో టెలిస్కోపిక్ ఫోర్కులు, 5-అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది. ఇప్పుడు Oben Rorr Evo రేంజ్, ఫీచర్లు, ధరల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Oben Rorr Evo Price
Oben Rorr Evo ఎలక్ట్రిక్ బైక్ కేవలం రూ.1 లక్ష ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అయితే ఈ ధర మొదటి 10,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఆ తర్వాత దీని ధర రూ.1.25 లక్షలకు పెరుగుతుందని పేర్కొంది. Oben Rorr Evo బ్లూ, రెడ్, వైట్, బ్లాక్ కలర్‌లలో లభిస్తుంది.
Also Read: మోటో మావ కుమ్మేశాడు: 108MP కెమెరా, 5200mAh బ్యాటరీతో ఊరమాస్ ఫోన్.. ఫీచర్లు హైలైట్..!
Oben Rorr Evo Specifications
Oben Rorr Evo గరిష్టంగా 9 kW పవర్‌ను, 250 Nm గరిష్ట వీల్ టార్క్‌ను కలిగి ఉంది. ఇందులో కొత్తగా కంపెనీలోనే అభివృద్ధి చేసిన I-PMSM మోటార్‌ను అమర్చారు. దీనికి IP67 రేటింగ్ ఉన్న 3.4 kWh LFP బ్యాటరీని అటాచ్ చేశారు. అదే సమయంలో 8 సంవత్సరాల వారంటీ కూడా అందించారు. కాగా ఈ బ్యాటరీని 280 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలలో పరీక్షించినట్లు ఓబెన్ పేర్కొంది.
Also Read:బైక్ మైలేజీని పెంచే అద్భుతమైన చిట్కాలు: ఇప్పుడు జనాలకి నువ్వ అవసరం..!
Oben Rorr Evo రేంజ్ విషయానికి వస్తే.. దీని IDC రేంజ్ 180 కి.మీ కాగా వాస్తవ రేంజ్ సుమారు 150 కి.మీగా ఉంటుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 110 కి.మీ. ఇది కేవలం 5 సెకన్లలో 0 నుండి 40 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఇప్పటికే ఉన్న ARX ప్లాట్‌ఫారమ్, ట్రెల్లిస్ ఫ్రేమ్ ఆధారంగా రోర్ ఎవోలో టెలిస్కోపిక్ ఫోర్కులు, 7-దశల సర్దుబాటు చేయగల మోనోషాక్ ఉన్నాయి. ఇందులో 270mm డిస్క్ బ్రేకులు, రెండు టైర్లపై CBS అందించారు. దీని మొత్తం బరువు 140kgగా ఉంది.
Also Read: రచ్చ రంబోలా ఆఫర్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ సేల్ అదిరింది: ఫుల్ డిస్కౌంట్స్..!
Oben Rorr Evoలో 5-అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎకో, రోడ్, హావోక్, స్మార్ట్ IQ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఈ బైక్‌లో యాప్‌తో కలిసి పనిచేసే ఫాల్ అలర్ట్ ఫీచర్ కూడా ఉంది. అలాగే LED లైటింగ్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్, హారిజాంటల్ DRLలతో కూడిన కొత్త ఫ్రంట్ ఎండ్ ఉంది. ఇందులో సీటు కింద 6-లీటర్ల కంపార్ట్‌మెంట్, రెండు USB పోర్ట్‌లతో కూడిన 4-లీటర్ల ట్యాంక్ స్టోరేజ్ ఏరియా ఉన్నాయి. ఛార్జింగ్ ఆప్షన్‌లలో ఓబెన్ ప్లగ్, స్టాండర్డ్ 15A సాకెట్ల కోసం ఒక ఓబెన్ పోర్ట్ అందించారు.
Follow Us