Mobile Offers: కెవ్వు కేక: నథింగ్ ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఫీచర్లు ఊరమాస్..!

ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ స్మార్ట్‌ఫోన్ పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీ నుంచి వచ్చిన మోడళ్లకు మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే ఈ కంపెనీ నుంచి Nothing Phone (4a) భారత మార్కెట్‌లో లాంచ్ అయింది.

New Update
mobile offers

mobile offers

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ స్మార్ట్‌ఫోన్ పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీ నుంచి వచ్చిన మోడళ్లకు మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే ఈ కంపెనీ నుంచి Nothing Phone (4a) భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు నథింగ్ ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ అవకాశం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో పాటు గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. Nothing Phone (4a)పై అందుబాటులో ఉన్న డీల్స్‌ గురించి తెలుసుకుందాం. 

Nothing Phone (4a) price and offers

Nothing Phone (4a) 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,999 ధరకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.4,450 తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ తగ్గింపుతో Nothing Phone (4a) కేవలం రూ.27,549కి లభిస్తుంది. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు రూ.25,550 వరకు తగ్గింపులను అందిస్తున్నాయి. ఈ పూర్తి ప్రయోజనం పొందాలంటే.. ఎక్స్ఛేంజ్ చేస్తున్న ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

Nothing Phone (4a) Specs

Nothing Phone (4a)లో 1224x2720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో కూడిన 6.78-అంగుళాల LTPS ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS 4.1పై పనిచేస్తుంది. దీనికి ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ శక్తినిస్తుంది. ఇందులో 50W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో కూడిన 5400mAh బ్యాటరీ అమర్చారు.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. Nothing Phone (4a) ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా, 8 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు