Nothing Phone 4a, Phone 4a Pro: నథింగ్ ఫోన్ నుంచి ఊరమాస్ సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలివే..!

నంథింగ్ ఫోన్ నుంచి తాజాగా మరో కొత్త సిరీస్‌ లాంచ్ అయింది. ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. అవి ఫోన్ 4a, ఫోన్ 4a ప్రో. నథింగ్ ఫోన్ 4a కొత్త గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 

New Update
Nothing Phone 4a

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నంథింగ్ ఫోన్ నుంచి తాజాగా మరో కొత్త సిరీస్‌ లాంచ్ అయింది. ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. అవి ఫోన్ 4a, ఫోన్ 4a ప్రో. నథింగ్ ఫోన్ 4a కొత్త గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 

Nothing Phone 4a

ఈ సిరీస్‌లో 8 GB RAM, 128 GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ.31,999గా కంపెనీ నిర్ణయించింది. 8 GB + 256 GB వేరియంట్ ధర రూ.34,999, 12 GB + 256 GB వేరియంట్ ధర రూ.37,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ.1,000 బ్యాంక్ ఆఫర్, రూ.6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ వంటి ఆఫర్లు ఉన్నాయి. నథింగ్ ఫోన్ 4a వైట్, బ్లూ, పింక్, బ్లాక్ కలర్‌లలో లభిస్తుంది. 

Nothing Phone 4a Pro

నథింగ్ ఫోన్ 4a ప్రో 8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999, 8 GB + 256 GB వేరియంట్ ధర రూ.42,999, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.45,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిల్వర్, పింక్, బ్లాక్ కలర్‌లలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు వరుసగా మార్చి 13, మార్చి 27 నుండి సేల్‌కు రానున్నాయి. 

స్పెసిఫికేషన్స్

ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల (1,224 x 2,720 పిక్సెల్స్) LTPS ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 Hz వరకు రిఫ్రెష్ రేట్, 2,160 Hz PWM డిమ్మింగ్ రేట్, 4,500 nits గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. నథింగ్ ఫోన్ 4a ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్ ఉంది. ఇందులో 63 మినీ LEDలు ఉన్నాయి. ఇది ముఖ్యమైన నోటిఫికేషన్‌లు, వాల్యూమ్ ఇండికేటర్, లైవ్ నోటిఫికేషన్‌లు, ఫ్లిప్ టు రికార్డ్, కెమెరా కౌంట్‌డౌన్ వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,400 mAh బ్యాటరీ 50 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 

Advertisment
తాజా కథనాలు