New Smartphone: మోటో మావ కుమ్మేశాడు: 108MP కెమెరా, 5200mAh బ్యాటరీతో ఊరమాస్ ఫోన్.. ఫీచర్లు హైలైట్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటో గ్లోబల్ మార్కెట్‌లో తన Moto G47ను విడుదల చేసింది. ఈ ఫోన్ G సిరీస్‌ నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చింది. దీని ముఖ్యమైన స్పెసిఫికేషన్లలో 108-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5,200mAh బ్యాటరీ ఉన్నాయి.

New Update
108MP Camera Phone

108MP Camera Phone

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటో గ్లోబల్ మార్కెట్‌లో తన Moto G47ను విడుదల చేసింది. ఈ ఫోన్ G సిరీస్‌ నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చింది. దీని ముఖ్యమైన స్పెసిఫికేషన్లలో 108-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5,200mAh బ్యాటరీ ఉన్నాయి. కంపెనీ ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అందించింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి మరింత తెలుసుకుందాం. 

Moto G47 Price

Moto కంపెనీ విడుదల చేసిన Moto G47 ధర విషయానికొస్తే.. ఈ ఫోన్ 8GB + 128GB వేరియంట్ సుమారుగా రూ. 35,000గా కంపెనీ నిర్ణయించింది. Moto G47 ఫోన్ పాంటోన్ ఫ్యూషియా రెడ్, పాంటోన్ ఇంపెనెట్రబుల్, పాంటోన్ నాటికల్ బ్లూ అనే మూడు కలర్‌లలో లభిస్తుంది. దీనిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

Moto G47 Specs

Moto G47లో 720 x 1,604 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 6.67-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 1,050 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 264 ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. Moto G47 6nm ప్రాసెసింగ్ టెక్నాలజీపై ఆధారపడిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా అందించారు. దీని ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్ IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. 

Moto G47 కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో వెనుకవైపు 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనికి 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు. Moto G47లో 5,200mAh బ్యాటరీ ఉంది. ఇది 20W టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే 6W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. 

Advertisment
తాజా కథనాలు