Meta Layoffs 2026 : మెటా ఉద్యోగులకు భారీ షాక్ .. 16 వేల ఉద్యోగాలు ఔట్!

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తన ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం పెడుతున్న విపరీతమైన ఖర్చులను తట్టుకోవడానికి,

New Update
meta

ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం మెటా తన ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం పెడుతున్న విపరీతమైన ఖర్చులను తట్టుకోవడానికి, పనితీరును మెరుగుపరచుకోవడానికి ఏకంగా 20 శాతం మేర ఉద్యోగులను తగ్గించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. అంటే దాదాపు 16,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. 

అయితే ఈ లేఆఫ్స్ ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికే దీనిపై చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ మాత్రం ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

జనరేటివ్ AI రంగంలో

మెటాలో ప్రస్తుతం దాదాపు 79,000 మంది పనిచేస్తున్నారు. ఒకవేళ ఈ 20 శాతం కోత నిజమైతే, 2022లో ప్రకటించిన ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ తర్వాత ఇదే అతిపెద్ద లేఆఫ్ అవుతుంది. అప్పట్లో నవంబర్ 2022లో 11,000 మందిని, ఆ తర్వాత నాలుగు నెలలకే మరో 10,000 మందిని ఇంటికి పంపారు. ఇప్పుడు మళ్ళీ జుకర్‌బర్గ్ జనరేటివ్ AI రంగంలో దూసుకుపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం టాప్ AI పరిశోధకులకు వందల కోట్ల రూపాయల జీతాలు ఇస్తూ ఆకర్షిస్తున్నారు. 2028 నాటికి AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సుమారు 600 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని మెటా ప్లాన్ చేస్తోంది.

ఈ క్రమంలోనే మోల్ట్‌బుక్, చైనాకు చెందిన మానస్ వంటి AI స్టార్టప్‌లను మెటా కొనుగోలు చేస్తోంది. AI వల్ల పెద్ద టీమ్‌లు చేసే పనులను ఇప్పుడు ఒక్క ప్రతిభావంతుడైన వ్యక్తి చేసేస్తున్నాడని జుకర్‌బర్గ్ గతంలోనే హింట్ ఇచ్చారు. అయితే మెటాకు AI రంగంలో కొన్ని ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. 

గత ఏడాది లామా 4 మోడల్స్ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అవోకాడో అనే కొత్త మోడల్ పై పనిచేస్తున్నప్పటికీ, దాని పనితీరు ఇంకా సంతృప్తికరంగా లేదని సమాచారం. కేవలం మెటా మాత్రమే కాదు, అమెజాన్ కూడా ఈ మధ్యే 16,000 మందిని తీసేసింది. జాక్ డోర్సీకి చెందిన బ్లాక్ సంస్థ కూడా AI వల్ల తక్కువ మందితోనే పని అయిపోతుందని సగం మంది స్టాఫ్ ను తొలగించడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు