/rtv/media/media_files/2026/03/06/itel-zeno-100-2026-03-06-20-49-00.jpg)
itel zeno 100
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐటెల్ తన లైనప్‌లోని కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. itel zeno 100 పేరుతో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ మన్నిక, కనెక్టివిటీపై దృష్టి సారిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే, UNISOC T7100 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌లో నడుస్తుంది.
itel zeno 100 Price
itel zeno 100 రెండు వేరియంట్లలో విడుదలైంది. 3GB + 64GB మోడల్ ధర రూ.6,866, 4GB + 64GB వేరియంట్ ధర రూ.7,285గా ఉంది. ఈ ఫోన్ సిల్క్ గ్రీన్, ప్యూర్ బ్లాక్, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. itel zeno 100 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కాగా ఈ ఫోన్ మోడల్ అచ్చం ఐఫోన్ 16 మాదిరి ఉంటుంది.
itel zeno 100 features
itel zeno 100 ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 720 × 1612 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. స్క్రీన్‌లో డైనమిక్ బార్ కూడా ఉంది. ఇది నోటిఫికేషన్‌లు, లైవ్ అలర్ట్‌లను చూపిస్తుంది. 2.2GHz ఆక్టా-కోర్ UNISOC T7100 ప్రాసెసర్‌తో పాటు మాలి G57 MP1 GPUతో పనిచేస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. itel zeno 100లో LED ఫ్లాష్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉంది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో IR బ్లాస్టర్, 3.5mm ఆడియో జాక్, DTS సౌండ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. బ్యాటరీ విషయానికొస్తే.. itel zeno 100 ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కంపెనీ అల్ట్రాలింక్ అనే ఫీచర్‌ను కూడా అందించింది. ఇది తక్కువ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది. ఇది 4జీ మొబైల్. ఇందులో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
Follow Us