/rtv/media/media_files/2026/04/30/flipkart-sasa-lele-sale-2026-04-30-15-01-23.jpg)
Flipkart SASA LELE Sale
ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటివి వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు పలు ప్రొడెక్టులను అతి తక్కువ ధరకే అందిస్తుంటాయి. అందులోనూ సీజన్ బట్టి కస్టమర్లకు అవసరమైన ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించి ఆకట్టుకుంటాయి. ఇక ఈ సమ్మర్ సీజన్‌లో ఎన్నో ప్రొడెక్టులను తక్కువ ధరకే అందిస్తున్నాయి. మరి మీరు కూడా భారీ డిస్కౌంట్‌తో మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం.
Flipkart SASA LELE Sale
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ flipkart కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. ‘‘SASA LELE’’ అనే పేరుతో ఈ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ మే 9 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, డబుల్ డిస్కౌంట్స్ సహా మరెన్నో అద్భుతమైన ఆఫర్లు పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కాగా ఈ సేల్ ఒక రోజు ముందుగానే అంటే మే 8వ తేదీన ప్లస్ & బ్లాక్ మెంబర్స్‌కు అందుబాటులోకి రానుంది.
ఇక ఈ SASA LELE Sale లో వినియోగదారులు పలు ప్రొడెక్టులను తక్కువ ధరకే పొందొచ్చు. ఇందులో SBI క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ప్లస్ అండ్ బ్లాక్ మెంబర్స్ 15 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ ఆఫర్స్ పొందుతారు. ఇవి మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ వంటివి ఉన్నాయి.
ఈ flipkart sasa lele sale లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, బ్యూటీ టిప్స్, హోమ్ అప్లయెన్సెస్, ఇయర్ బడ్స్, ఫ్యాషన్, బ్లూటూత్ స్పీకర్స్, ఏసీలు, వాషింగ్ మెషీన్స్, కూలర్స్, స్మార్ట్‌వాచెస్, వీడియో గేమ్‌పాడ్స్ సహా మరెన్నో ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఉన్నాయి.
Double Dhamaka: ఈ డబుల్ ధమాకా డీల్‌లో ప్రతి రోజు కొత్త కొత్త ప్రొడెక్టులు రీఫ్రెస్ అవుతాయి.
Brand Hours: ఈ బ్రాండ్ అవర్స్ డీల్‌లో ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మరికొన్ని ఆఫర్లు, ప్రొడెక్టులు లభిస్తాయి.
వీటితో పాటు Dounle Discounts, Rush Hour, Double Flash Hour, Tick Tock Deals ఇలా ప్రతి డీల్‌లో కొత్త కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లు పొందవచ్చు.
Follow Us