/rtv/media/media_files/2025/02/24/hLKeRE5UAPjZXMXFeKh0.jpg)
BSNL new recharge Photograph: (BSNL new recharge)
ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మరో అడుగు ముందుకేసింది. గ్రామాలు, చిన్న చిన్న సిటీల్లో ఉండే ఇంటర్నెట్ సమస్యలను పరిష్కరించేందుకు తాజాగా మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు ‘అఫర్డబుల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో తక్కువ ధరకే ఎక్కువ డేటా, హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నారు.
రూ. 1,099 ప్లాన్
BSNL తన అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం.. తక్కువ ఖర్చుతో గ్రామీణ వినియోగదారులకు వైఫై సౌకర్యాన్ని కల్పించడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్ధేశ్యం. ఈ ప్లాన్‌లో రూ.1,099తో రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలల పాటు వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. వినియోగదారులకు ప్రతి నెల 1,400 జీజీ డేటా లభిస్తుంది. అంటే మూడు నెలల కాలపరిమితికి మొత్తం 4,200 జీబీ డేటాను పొందొచ్చు.
ఫైబర్ టెక్నాలజీ ద్వారా 40Mbps వరకు స్టాండర్డ్ వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ఇది ఆన్‌లైన్ క్లాస్‌లు, స్ట్రీమింగ్, వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా అందిస్తుంది. అయితే ఈ కాలింగ్ సదుపాయం ల్యాండ్ లైన్ కనెక్షన్ ద్వారా పొందుతారు.
కాగా ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం అయిపోయింది. ప్రతి నగరంలో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ విస్తరించింది. కానీ మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ మొబైల్ డేటానే యూజ్ చేస్తున్నారు. అందువల్ల దీనిని దృష్టిలో ఉంచుకుని బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్ నేరుగా ఇంటికే వైర్‌ద్వారా రానుంది.
కొత్త కనెక్షన్ పొందడం ఎలా?..
మీరు మీ ఇంట్లోకి లేదా ఆఫీసులోకి ఈ కొత్త వైఫై కనెక్షన్ తీసుకోవాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా మీ మొబైల్‌లో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో లాగిన్ అవ్వాలి. తర్వాత న్యూ కనెక్షన్ సెక్షన్‌కు వెళ్లి వివరాలను నమోదు చేయాలి. అక్కడ ఏరియా సర్విస్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
Follow Us