/rtv/media/media_files/2026/03/30/april-2026-up-coming-cars-2026-03-30-16-30-16.jpg)
april 2026 Up Coming Cars
దేశీయ మార్కెట్‌లో ఆటో మోటివ్ పరిశ్రమకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి నెల కొత్త కొత్త కంపెనీలు తమ న్యూ మోడళ్లతో దర్శనమిచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అధునాతన ఫీచర్లు, టెక్నాలజీతో వావ్ అనిపిస్తున్నాయి. ఇక వచ్చే నెల అంటే ఏప్రిల్ 2026లో పలు కార్లు మార్కెట్‌లో లాంచ్ కాబోతున్నాయి. అందులో టయోటా ఎబెల్లా, ఎంజీ మేజెస్టర్, మెర్సిడెస్ బెంజ్ CLA వంటివి ఉన్నాయి. అలాగే వోక్స్‌వ్యాగన్ టైగన్ కాంపాక్ట్ SUVకి ఒక మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ రాబోతున్నాయి. వచ్చే నెలలో రాబోతున్న కొత్త కార్లు, SUVల గురించి తెలుసుకుందాం.
Volkswagen Taigun Facelift Taigun SUV
వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ టైగన్ SUV ఏప్రిల్ 9న లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. దీని ముందు మోడల్ 2021లో విడుదలైంది. మళ్లీ ఇప్పుడు అధునాతన ఫీచర్లు, అప్డేట్‌లతో ఈ ఎస్‌యూవీ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఇందులోని ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. ఈ SUVలో మసాజింగ్ బ్యాక్ సీటింగ్ ఉండే అవకాశం ఉంది. ఇందులో కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించే అవకాశం ఉంది.
Mercedes-Benz CLA
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఏప్రిల్ 2026లో తన కొత్త తరం CLAను విడుదల చేయనుంది. ఈ కొత్త CLA పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. దీనిలోని టాప్-స్పెక్ CLA 250+ లాంగ్ రేంజ్ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌పై 792 కి.మీ మైలేజీ అందిస్తుంది. మెర్సిడెస్-బెంజ్ CLA ఎలక్ట్రిక్ సెడాన్, CLA 200 వేరియంట్‌లో చిన్న బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ రెండు వెర్షన్‌లు 800V EV ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంటాయి. కాగా మెర్సిడెస్-బెంజ్ CLA ఎక్స్-షోరూమ్ ధరలు రూ.55 లక్షల నుండి రూ.59 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
Nissan Tecton
నిస్సాన్ తన సరికొత్త C-SUV అయిన టెక్టన్‌ను ఏప్రిల్‌లో లాంచ్ చేయనుంది. ఈ మోడల్ న్యూ జెన్ రెనాల్ట్ డస్టర్ ఆధారంగా రూపొందింది. ఇది అద్భుతమైన డిజైన్, మరింత ప్రీమియం ఇంటీరియర్‌తో భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు.
Toyota Urban Cruiser Ebella
జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా ఏప్రిల్‌లో తన అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ధరలను ప్రకటించనుంది. కంపెనీ దీనిని ఇటీవలే పరిచయం చేసింది. ఇది మారుతి సుజుకి ఇ-విటారా, బ్యాడ్జ్ స్వాప్డ్ వంటి మోడళ్ల వెర్షన్, డిజైన్, ఫీచర్లు, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లనే కలిగి ఉంటుంది. ఇది 61kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 543 కి.మీ మైలేజీ వస్తుంది. ఇందులో 49kWh యూనిట్ కూడా అందుబాటులో ఉంది.
MG Magister
ఎంజి మ్యాజెస్టర్ ట్విన్-టర్బోచార్జ్డ్ 2.0 -లీటర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 213bhp, 478Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాజెస్టర్ 2WD, 4WD రెండు ఆప్షన్‌లలో అందించబడుతుంది. ఇందులో 4WD ఆప్షన్‌లో మల్టిపుల్ టెర్రైన్ మోడ్‌లు, ట్రిపుల్ లాకింగ్ డిఫరెన్షియల్స్ ఉన్నాయి. వచ్చే నెలలో ఈ మోడల్ ధరలను అధికారికంటే వెల్లడించనున్నారు. మే నెలలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
Follow Us