iphone foldable phone design: డిజైన్ లీక్.. ఐఫోన్ 18 సిరీస్‌లోనే రిలీజ్

యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్‌కు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ సన్నీ డిక్సన్ షేర్ చేసిన 3D డిజైన్ ఫైల్స్ ప్రకారం, యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ అప్‌డేట్ లీక్ అయ్యింది.

New Update
_iphone foldable phone design

యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్‌కు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ సన్నీ డిక్సన్ షేర్ చేసిన 3D డిజైన్ ఫైల్స్ ప్రకారం, యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ అప్‌డేట్ లీక్ అయ్యింది. లీకైన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఐఫోన్ ఫోల్డ్ బుక్-స్టైల్ మడత విధానాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ మాదిరిగా నిలువుగా మడతపడుతుంది.

మెయిన్ డిస్‌ప్లే: ఇది తెరిచినప్పుడు 7.8 అంగుళాల బిగ్ స్క్రీన్‌ కలిగి ఉంటుంది, ఇది దాదాపు ఐప్యాడ్ మినీ సైజ్‌లో ఉండనుందట. దీనివల్ల మల్టీ టాస్కింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉండనుంది.
కవర్ డిస్‌ప్లే: ఫోన్ మడతపెట్టి ఉన్నప్పుడు వాడుకోవడానికి బయట వైపు 5.3 నుండి 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది.

ముఖ్యంగా, ఈ ఫోల్డబుల్ స్క్రీన్‌పై మడత గుర్తులు కనిపించకుండా యాపిల్ ప్రత్యేకమైన లిక్విడ్ మెటల్ హింజ్ టెక్నాలజీ వాడుతున్నట్లు సమాచారం.

కెమెరా ఫీచర్లు

సాధారణంగా ఐఫోన్ ప్రో మోడల్స్‌లో 3 కెమెరాలు ఉంటాయి, కానీ ఈ ఫోల్డబుల్ మోడల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌ను యాపిల్ పరిచయం చేయబోతోంది.

రియర్ కెమెరా: వెనుక వైపు హారిజాంటల్ అమర్చిన పిల్-షేప్ మాడ్యూల్‌లో రెండు 48MP కెమెరాలు ఉండే అవకాశం ఉంది.
సెల్ఫీ కెమెరాలు: బయట స్క్రీన్‌పై ఒకటి, లోపలి స్క్రీన్‌పై మరొకటి చొప్పున మొత్తం రెండు సెల్ఫీ కెమెరాలు ఉంటాయి.

ఈ ఫోన్ టైటానియం, అల్యూమినియం మిశ్రమంతో తయారైన ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల ఫోన్ దృఢంగా ఉండటమే కాకుండా బరువు కూడా తక్కువగా ఉంటుంది. లోపల యాపిల్ అత్యంత శక్తివంతమైన A20 Pro (2nm) చిప్‌సెట్‌ను వాడే అవకాశం ఉంది. "ఐఫోన్ ఫోల్డ్ అనేది కేవలం ఫోన్ మాత్రమే కాదు, ఇది ఐఫోన్ మరియు ఐప్యాడ్ కలయికగా ఉండబోతోంది." అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఐఫోన్ ఫోల్డ్ సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారు 2,000 డాలర్ల (దాదాపు రూ.1,85,000) నుండి ప్రారంభం కావచ్చని అంచనా.

Advertisment
తాజా కథనాలు