/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/it-company-jpg.webp)
IT Company Gives 33% Stake to its Employees: మనం పడిన కష్టాన్ని గుర్తించి జీతం పెంచితేనో..బోనస్లు ఇస్తేనో చాలు ఉద్యోగులు తెగ సంబరపడిపోతుంటారు. అలాంటిది ఏకంగా కంపెనీలోనే వాటాలు (Shares) ఇస్తే ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. ఇప్పుడు ఓ ఐటీ కంపెనీ అలాంటి పనే చేసింది. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు కార్లు, కంపెనీ వాటాలు ఉచితంగా ఇచ్చింది.
ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ వార్తే ట్రెండింగ్ గా నిలిచింది. అసలు చేస్తే ఇలాంటి కంపెనీలోనే ఉద్యోగం చేయాలని చాలా మంది ఐటీ ఉద్యోగులు (IT Employees) అనుకుంటున్నారు. అసలు కార్లు, షేర్లు ఫ్రీగా ఇచ్చిన కంపెనీ ఏది? ఎందుకు ఇలా చేశారు అనే దాని గురించి తెలుసుకుందాం.
టెక్ కంపెనీల్లో ఒకటైన Ideas2IT అనే కంపెనీ తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులను కంపెనీకి యజమానులుగా మార్చింది. 100 బిలియన్ డాలర్ల విలువ ఉన్న ఈ కంపెనీ తన కంపెనీలోని 33 శాతం వాటాను ఉద్యోగులకు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. ఇందులో 5 శాతం వాటాన్ని కంపెనీ ప్రారంభం అయినప్పటి నుంచి అంటే 2009 నుంచి ఉన్న 40 మంది ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
మిగిలిన 28 శాతం వాటాను కంపెనీలో ఉన్న మిగిలిన 700 మంది సిబ్బందికి ఇవ్వాలని అనుకుంటున్నట్లు కంపెనీ యజమాన్యం తెలిపింది. అంతే కాకుండా కంపెనీలో ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్న 50 మంది ఉద్యోగులకు 50 కార్లను (Gifted 50 Cars) ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది.
అంతే కాకుండా 8 లక్షల నుంచి 15 లక్షల మధ్య మారుతీ సుజుకి లైనప్ నుంచి ఉద్యోగులు తమకు న్చిన వాహనాలను ఎంచుకోవచ్చని కంపెనీ మరో బంపరాఫర్ కూడా ఇచ్చింది. ఆ వాహనాలను సదరు ఉద్యోగి పేరు పైనే రిజిస్టర్ చేస్తరాని యజమాన్యం తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం కూడా ఆ కంపెనీలో అప్పటికీ ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకకు 100 కార్లను అందించి వార్తల్లో నిలిచింది.
ఈసారి మరో 50 కార్లను ఇ్వడానికి ముందుకు వచ్చింది. ఈ కంపెనీ ఉద్యోగులు భారత్ తో పాటు యూఎస్, మెక్సికో లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. దీని గురించి కంపెనీ ఉద్యోగులు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యజమాన్యం ఎప్పుడూ కూడా ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపారు. ఈ విషయం గురించి తెలుసుకున్న మిగిలిన టెక్ కంపెనీ ఉద్యోగులు లక్ అంటే ఈ కంపెనీ ఉద్యోగులదే అని చెప్పుకుంటున్నారు.
Ideas2IT, #tech firm valued at $100mn, announces transfer of 1/3rd of company ownership to its most-trusted employees
— Sidharth.M.P (@sdhrthmp) January 2, 2024
They've just given away 50cars(₹8-15lakh range) to those that have served 5+yrs..In 2022, 100 staff got cars(regd in own name)#chennai #india #business… pic.twitter.com/yYXA7Isddm
Also read: ”ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు” అంటారు ఎందుకో తెలుసా!