మరోసారి టీమిండియా టాప్.. టెస్ట్ చాంపియన్ షిప్ లో నెక్స్ట్ ఎవరో తెలుసా!

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి టీమిండియా నంబర్‌ వన్‌ పొజిషన్‌కు చేరింది. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ ఘోర ఓటమితో రెండో స్థానానికి పడిపోవడంతో 2023-25 తాజా ర్యాంకింగ్స్‌లో భారత్‌ ర్యాంకు ఎగబాకింది.

New Update
మరోసారి టీమిండియా టాప్.. టెస్ట్ చాంపియన్ షిప్ లో నెక్స్ట్ ఎవరో తెలుసా!

World Test Championship: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి టీమిండియా నంబర్‌ వన్‌ పొజిషన్‌కు చేరింది. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ ఘోర ఓటమితో రెండో స్థానానికి పడిపోవడంతో 2023-25 తాజా ర్యాంకింగ్స్‌లో భారత్‌ ర్యాంకు ఎగబాకింది. 2023-25 సైకిల్‌లో ఆస్ట్రేలియాకు టెస్టుల్లో ఇదే తొలి విజయం.

ఇది కూడా చదవండి: ప్రొటిస్‌ గడ్డపై అర్షదీప్‌ గ్రేట్‌ రికార్డ్‌.. ఆ ఘనత సాధించిన తొలి పేసర్‌ ఇతడే!

పాకిస్థాన్‌పై భారీ విజయంతో 2023-25 సైకిల్‌లో బోణీ కొట్టిన ఆసీస్‌ ఐదో ర్యాంకులో ఉంది. ఈ సైకిల్‌లో కంగారూ జట్టు ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడగా ఒకే మ్యాచ్‌లో గెలుపొందింది. కాగా, భారత్‌ ఈ సైకిల్‌లో ఇప్పటివరకూ ఒకే మ్యాచ్‌ ఆడి విజయం సాధించింది. ప్రస్తుతం భారత్‌ 16 పాయింట్లతో టాప్‌లో ఉంది. ప్రస్తుతం ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో భారత్‌, పాక్‌ కొనసాగుతుండగా; తర్వాతి స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ (15) ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఆడుతూ.. పాడుతూ… సఫారీలతో తొలివన్డేలో భారత్‌ అలవోక విజయం

తొలి టెస్టులో ఆసిస్‌ భారీ విజయం
మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన పెర్త్‌ మ్యాచ్‌లో కంగారూ జట్టు 360 పరుగుల భారీ తేడాతో పాక్‌ జట్టును మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 233/5 చేయగా; పాకిస్థాన్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 271, రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి ఆసిస్‌ బౌలింగ్‌ దాటికి చిత్తయ్యింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వార్నర్‌ 164, మిచెల్‌ మార్ష్‌ 90 పరుగులతో చెలరేగి ఆడారు. మరోవైపు ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన పాక్‌ బౌలర్‌ ఆమిర్‌ జమాల్‌ 6 వికెట్లతో సత్తా చాటాడు. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (62) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు