IND vs ENG : చేతికి నల్ల రిబ్బన్లు ధరించి గ్రౌండ్‌లోకి దిగిన టీమిండియా.. ఎందుకంటే?

రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆటలో భార‌త ఆట‌గాళ్లు న‌ల్ల రిబ్బన్ల‌తో బ‌రిలోకి దిగారు. భార‌త మాజీ కెప్టెన్‌, టెస్ట్ క్రికెట‌ర్ ద‌త్తాజీరావు గైక్వాడ్ మృతికి సంతాపంగా ప్లేయ‌ర్లు న‌ల్ల రిబ్బ‌న్లు ధ‌రించారు.

New Update
IND vs ENG : చేతికి నల్ల రిబ్బన్లు ధరించి గ్రౌండ్‌లోకి దిగిన టీమిండియా.. ఎందుకంటే?

INDIA vs ENGLAND 3rd Test : ఇండియా వర్సెస్ ఇంగ్లండ్‌(India v/s England) మూడో టెస్టు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. భారత్‌ చేసిన భారీ స్కోరుకు ఇంగ్లండ్‌ ధీటుగా సమాధానమిస్తొంది. బాజ్‌ బాల్‌ బ్యాటింగ్‌తో ఫాస్ట్‌గా రన్స్ చేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమండియా(Team India) 445 రన్స్‌కు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఓవర్‌నైట్ స్కోరు రెండు వికెట్లకు 207 రన్స్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ సెంచరీ హీరో డక్కెట్‌ వికెట్‌ను కోల్పోయింది. ఇక బెయిర్‌ స్టో కూడా డకౌట్ అయ్యాడు. రూట్‌ కూడా 18పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత స్టోక్స్‌, ఫోక్స్‌ కూడా ఔటయ్యారు. ఇక మూడో రోజు ఆటలో టీమిండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి గ్రౌండ్‌లోకి దిగారు.

Also Read : IND vs ENG: టీమిండియాకు భారీ షాక్‌.. సడన్‌గా టీమ్‌ని వీడిన అశ్విన్‌.. ఎందుకంటే?

రాజ్‌కోట్‌(Rajkot) లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు శనివారం భారత ఆటగాళ్లు మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్(Datta Gaekwad) జ్ఞాపకార్థం చేతికి నల్ల బ్యాండ్‌లు ధరించారు. 1951 నుంచి 1962 మధ్యకాలంలో భారత్ తరఫున 11 టెస్టులు ఆడిన దత్తాజీరావు 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 13న మరణించారు. 95 సంవత్సరాల వయస్సులో ఆయన దేశానికి అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్. దత్తాజీరావు భారత మాజీ బ్యాటర్‌. నిరంజన్ షా స్టేడియం(Niranjan Shah Stadium) లో మూడో రోజు ఆట ప్రారంభానికి కొద్దిసేపటి ముందు బీసీసీఐ(BCCI) ఒక ప్రకటనలో ఇలా తెలిపింది. 'ఇటీవల మరణించిన భారత మాజీ కెప్టెన్, భారత టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ జ్ఞాపకార్థం టీమ్ ఇండియా నల్ల బ్యాండ్‌ ధరిస్తుంది..' అని తెలిపింది.

దత్తా గైక్వాడ్ ఎవరు?

దత్తా గైక్వాడ్ రంజీ ట్రోఫీలో 14 శతకాలతో 3139 పరుగులు సాధించాడు. రంజీలో అతని అత్యధిక స్కోరు 1959-60లో మహారాష్ట్రపై సాధించిన 249 పరుగులు. భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్‌గా సేవలందించిన అన్షుమన్ గైక్వాడ్ దత్తా గైక్వాడ్ కుమారుడే. ఇతనికి బరోడా రాజకుటుంబీకులతో కూడా సంబంధముంది. బరోడా సంస్థానానికి డిప్యూటీ కంప్ట్రోలర్‌గా కూడా పనిచేశారు. దత్తా గైక్వాడ్ ప్రారంభంలో బాంబే విశ్వవిద్యాలయం, బరోడాలోని మహారాజా శివాజీ విశ్వవిద్యాలయం తరఫున ఆడినాడు. 1952లో లీడ్స్ లో టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. ఎప్పుడూ ఓపెనింగ్ బ్యాటర్‌గా దిగకుండానే ఏకంగా తొలి టెస్టులోనే ఓపెనర్‌గా రంగప్రవేశం చేశాడు. తదుపరి సంవత్సరంలో వెస్టీండిస్ పర్యటనలో రెండో టెస్టులో క్యాచ్ పట్టేసమయంలో విజయ్ హజారేతో ఢీకొని భుజం గాయం కారణంగా ఆయన కెరీర్‌ అర్థాంతరంగా ఆగిపోయింది.

Also Read : రాహుల్- ప్రియాంక మధ్య గొడవలు.. అందుకే రాలేదు: బీజేపీ

Advertisment
Advertisment
తాజా కథనాలు