Yuvagalam: యువగళం ముగింపు సభ.. ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్

యువగళం ముగింపు సభ విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ సభకు చంద్రబాబు, జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సభ జరగనుంది.

New Update
Yuvagalam: యువగళం ముగింపు సభ.. ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్

Nara Lokesh Yuvagalam: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు.. టీడీపీ పార్టీ (TDP Party) ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి తెచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టి ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇటీవల రెండో విడత యువగళం పాదయాత్ర ను మొదలు పెట్టిన లోకేష్.. నిన్నటితో యువగళం పాదయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ నేతలు విజయవాడలో యువగళం ముగింపు సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు కానున్నారు.

ALSO READ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ!

మొత్తం 110 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలు. యువగళం ముగింపు సభకు దాదాపు 6 లక్షల మంది హాజరు అవుతారని అంచనా వేశారు.50 వేల మంది కూర్చొని బహిరంగ సభను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ విజయోత్సవ సభ నిర్వహణకు మొత్తం 16 కమిటీలను వేశారు. స్టేజి 180 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పుఠీ స్టేజి ఉండనుంది. స్టేజిపై 600 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు విక్షించేందుకు స్టేజి వెనుకాల 50 అడుగుల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు.

ఈ సభ కోసం టీడీపీ పార్టీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఈ సభ కొరకు 7 ప్రత్యేక రైళ్లను ఏర్పర్చు ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో ప్రజలు, టీడీపీ అభిమానులు విజయవాడకు చేరుకోనున్నారు. పార్కింగ్ కోసం ఉత్తరాంద్ర వైపు 2 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. విశాఖ వైపు 2 పార్కింగ్ స్థలాలు, ఒక్కో పార్కింగ్ స్థలం 50 ఎకరాల్లో ఏర్పాటు. భోగాపురం వచ్చే వారందరికి భోజన ఏర్పార్లు చేశారు. మధ్యాహ్నం
3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సభ జరగనుంది.

ALSO READ: కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్…కేటీఆర్ ఆన్ ఫైర్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment