AP: రేపల్లెలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి భారీ చేరికలు!

రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పలువురు టీడీపీ నాయకులు మూకుమ్మడిగా వైసీపీలోకి చేరారు. విజయసాయి రెడ్డి వారందరినీ కండువాకప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. రేపల్లె వైసీపీ ఇంఛార్జిగా ఈవూరు గణేష్ ను నియమించారు.

New Update
AP: రేపల్లెలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి భారీ చేరికలు!

Guntur: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం కార్యకర్తలు టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలాల నుంచి చాలామంది టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా వైసీపీలోకి చేరారు. వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి వారందరినీ కండువాకప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.

రేపల్లె ఇంఛార్జిగా ఈవూరు గణేష్..
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైసీపీ ఇంఛార్జి ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆలోచన మేరకు గణేష్ ను రేపల్లె నియోజకవర్గానికి ఇంఛార్జిగా మోపిదేవి వెంకటరమణ నియమించారు. ప్రతీ పేదవాడికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేలు జరిగిందని, రాష్ట్రంలోని ప్రతీ పేదవాడని ఆర్ధికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలనేదే జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అన్నారు. అందుకే మళ్లీ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని అంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. రేపల్లెలో ప్రతీ ఒక్కరూ ఈవూరు గణేష్ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు.

175 సాధించడమే లక్ష్యం..
అలాగే రాజ్యసభ సభ్యులు, విజయసాయిరెడ్డి ఈవూరు గణేష్ ను రేపల్లె ప్రజలంతా గెలిపించి మీకు సేవచేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ కోసం మోపిదేవి వెంకటరమణ చేసిన త్యాగం మరువలేనిదని, కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం కృషి చేశారని గుర్తు చేశారు. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. రేపల్లె నుంచి ఈవూరు గణేష్ ను గెలిపిస్తే అటు అసెంబ్లీలోనూ ఇటు పార్లమెంట్ లోనూ మీ సమస్యలు వినిపించే అవకాశం దక్కుతుందన్నారు. 175 కు 175 సీట్లు సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు.

ఇది కూడా చదవండి : MLA RK: జగన్‌ను తిట్టమన్నారు… ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు!

ఆయనకు అవకాశం ఇవ్వొద్దు..
ఇక టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ కు మూడవసారి రేపల్లె నుంచి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నట్లు ప్రజలు చెప్పారన్నారు. అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని, సత్యప్రసాద్ హైదరాబాద్ లో కూర్చుని పేకాట ఆడుకుంటాడని విమర్శించారు. అలాంటి వ్యక్తిని కాకుండా నిత్యం మీతోనే ఉండే ఈవూరు గణేష్ ను గెలిపించుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. అసెంబ్లీ, లోక్ సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి జగన్ అధికప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.

వైసీపీ అలా చేయదు..
అణగారిన వర్గాలకు సరైన ప్రధాన్యం కల్పించాలనేదే జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు. రిజర్వేషన్ల శాతానికి మించి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. చంద్రబాబు లాగా మనం నటించడం లేదు. వాస్తవాలకు దగ్గరగానే మనం నడుచుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే సామాజిక సమతుల్యత పాటిస్తాం. రాబోయే రెండు మూడు రోజుల్లో టీడీపీ బీజేపీతో జతకట్టడానికి తహతహలాడుతుంది. పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే పోటీ చేశాం. భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీచేస్తాం. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం కోసమే కొన్ని అంశాల్లో మనం మద్దతిచ్చాం. జగన్ మోహన్ రెడ్డిని బలోపేతం చేసి మరింత గొప్ప విజయాన్ని అందించాలని కోరుతున్నామని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Man Marries Two Women : ఒకే ముహూర్తంలో ఇద్దరమ్మాయిలతో పెళ్లి...విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు

ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

New Update
 Man Marries Two Women

 Man Marries Two Women Photograph

 

wedding card
wedding card Photograph: (wedding card)

 Man Marries Two Women: ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ కార్డు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఒకే హీరోను ఇద్దరు అక్కచెల్లెళ్లు ఇష్టపడడం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. సినిమాల్లోనూ చివరికి ఎవరో ఒకరు త్యాగం చేయడం సర్వసాధారణం కానీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒక వరుడికి అక్కాచెల్లెళ్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఒకే ముహూర్తంలో, ఒకే మండపంలో అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకునేందుకు వరుడు సిద్ధమయ్యాడు. బంధువులు, సన్నిహితుల్ని ఆహ్వానిస్తూ శుభలేఖలు కూడా ప్రింట్ చేశారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

 శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మగారిపల్లికి చెందిన గంగులమ్మ రాజువేలు కుమారుడు గంగరాజుకు.. కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి టౌన్‌కు చెందిన కె సుశీల రఘుల కుమార్తెలు శ్రీలక్ష్మి, ఐశ్వర్యలను ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు కార్డులో ప్రింట్ చేశారు. ఈ నెల 10న ఉదయం ముహూర్తం కాగా.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణం బెంగళూరు రోడ్, గుమ్మ్యగారిపల్లి క్రాస్ దగ్గర ఉన్న రంగమహాల్‌లో పెళ్లి చేస్తున్నారట. పెళ్లికి ముందు రోజు అంటే ఈ నెల 9న రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కాచెల్లెళ్లను ఒకే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడం వెనుక కారణం ఏంటని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

శ్రీసత్యసాయి జిల్లా కర్ణాటకకు సరిహద్దులో ఉంటుంది.. దీంతో స్థానికులు కొందరు ఉపాధి కోసం కర్ణాటకకు వెళ్లి అక్కడే స్థిరపడతారు.. పొరుగునే ఉన్న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.. ఈ క్రమంలోనే శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడ్ని కర్ణాటకకు చెందిన ఇద్దరు వధువులతో పెళ్లి చేస్తున్నారు. మొత్తానికి ఈ ఆయనకిద్దరు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వెడ్డింగ్ కార్డ్ పోస్ట్ కింద నెటిజన్లు స్పందిస్తున్నారు. 'లోకం మారుతోంది అంటే ఏంటో అనుకొన్న, ఈ వెడ్డింగ్ చూసి నిజమనిపిస్తోంది.. ఒకేసారి ఇద్దరమ్మాయిల ముద్దుల మొగుడుగా.. తమ్ముడు గంగరాజు నీ గుండె పది కాలాలు బ్రతకాలి' అంటూ వెడ్డింగ్ కార్డును షేర్ చేశారు ఓ నెటిజన్. 

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి


'పేరు మారింది కావచ్చు. అందుకే అలా రాసారేమో' అని ఒక నెటిజన్ అంటే.. 'ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త రా బాబు... నీ ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి. ఆ.విషయంలో ఇద్దరినీ మెయింటైన్ చేయాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అనుకో.. ముందు ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు ఉంటే మానుకో.. లేకపొతే ముందు ముందు ఆ రెండు వ్యసనాలకు శాశ్వతంగా బానిస కావాల్సి ఉంటుంది.. జాగ్రత్త' అని మరొకరు సలహా ఇస్తూ రిప్లై ఇచ్చారు. 'ఒక్కరిని కట్టుకున్నాందుకే బాధపడుతుంటే, మరి నీ పరిస్థితి ఏంటి? గట్టి గుండె అనిచెప్పాలి' అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. అయితే ఇద్దరిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయోమో అందుకే ఒకరికే ఇచ్చి పెళ్లి చేస్తున్నారని మరొకరు కామెంట్‌ చేస్తున్నారు.  మొత్తానికి ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

#sri-sathya-sai-district #womens #marriage
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు