వైఎస్‌ఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. టీడీపీ నేతలు ఫైర్! ఏపీలో సీఎం జగన్ చేసే అరాచకాలు చూసి వైఎస్‌ఆర్ ఆత్మ క్షోభిస్తుందని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు. రోజుకో అరెస్టుతో జగన్ చరిత్ర హీనుడిగా ముగిసిపోతారని అన్నారు. పులివెందుల ప్రజల్లోనూ జగన్‌పై వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. By V.J Reddy 15 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP Politics: టీడీపీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. బిటెక్ రవి అరెస్ట్ పై స్పందించిన లోకేష్.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామే భయంతోనే ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి.. ఓర్వలేక అక్కడి టీడీపీ నేతలను అరెస్టులు చేపిస్తున్నారని ఫైర్ అయ్యారు. పులివెందులలో జగన్ పునాదులు కదులుతున్నాయని విమర్శించారు. ALSO READ: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేత! జగన్ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు: సోమిరెడ్డి అక్రమ కేసులతో సీఎం జగన్ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత సోమిరెడ్డి. జగన్ చేసే క్షుద్ర రాజకీయాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత నీచ రాజకీయాలు ఎవరూ చేయలేదని విమర్శించారు. రోజుకో అరెస్టుతో జగన్ చరిత్ర హీనుడిగా ముగిసిపోతారని అన్నారు. పులివెందుల ప్రజల్లోనూ జగన్‌పై వ్యతిరేకత మొదలైందని సోమిరెడ్డి పేర్కొన్నారు. ALSO READ: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! జగన్ కు రాజకీయ సమాధి కడతారు: అయ్యన్నపాత్రుడు బీటెక్ రవి అరెస్ట్ పై స్పందించారు టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. టీడీపీలో రవి మంచి నాయకుడని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడపలో బీటెక్ రవి టీడీపీని గెలిపించారని పేర్కొన్నారు. కడపలో టీడీపీ గెలవడం చిన్న విషయం కాదు అని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఏమి చెయ్యలేరని.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో జగన్ కు రాజకీయ సమాధి కడతారని తెలిపారు. #ap-news #lokesh #cm-jagan #ap-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి