లోకేష్ యువగళం.. రేపటి నుంచి షురూ!

రెండవ విడత యువగళం పాదయాత్రను రేపు ప్రారంభించనున్నారు టీడీపీ నేత లోకేష్. పాదయాత్రకు సంబంధించి షెడ్యూల్ ను టీడీపీ కార్యాలయం విడుదల చేసింది. రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు లోకేష్.

New Update
Minister Lokesh: నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్.. ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసిన మంత్రి!

Lokesh Yuvagalam: ఏపీలో మరోసారి టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు.. అలాగే జగన్ సర్కార్ యొక్క వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు టీడీపీ ముఖ్య నేత లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చెప్పట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ తో ఆగిపోయిన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.

ALSO READ: తస్మాత్ జాగ్రత్త!.. పేర్ని నానికి కొల్లు రవీంద్ర హెచ్చరిక!

రేపటి నుంచి యువగళం రెండవ విడత పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. ఇప్పటివరకు లోకేష్ మొత్తం 2852.4 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

రేపటి నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:

ఉదయం:
* 10.19 – రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
* 11.20 – తాటిపాక సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
* 12.35 – పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం, నగరంలో గెయిల్, ఓఎన్జిసి బాధితులతో ముఖాముఖి.
* 2.00 – మామిడికుదురులో స్థానికులతో సమావేశం.
* 2.45 – పాశర్లపూడిలో భోజన విరామం.

సాయంత్రం:
* 4.00 – పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
* 4.30 – అప్పనపల్లి సెంటర్ లో స్థానికులతో సమావేశం.
* 5.30 – అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ.
* 6.30 – బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి.
* 7.30 – పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటీ.
* 7.45 – పేరూరు శివారు విడిది కేంద్రంలో బస.

ALSO READ: కాంగ్రెస్ అధికారంలోకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి.. రాహుల్ గాంధీ

Advertisment
Advertisment
తాజా కథనాలు