Lokesh : జగన్ ఐపీఎల్ టీమ్ పేరు 'కోడికత్తి వారియర్స్..' లోకేశ్ కౌంటర్లు! టీడీపీ కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని.. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ విజయనగరంలో నవశకం వైసీపీ టార్గెట్‌గా లోకేశ్ ఫైర్ అయ్యారు. జగన్ ఐపీఎల్ టీమ్ అంటూ పెడితే, దాని పేరు కోడికత్తి వారియర్స్ అని చురకలంటించారు. By Trinath 20 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి IPL Team Kodikatthi Warriors : టీడీపీ(TDP) జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన యువగళం ముగింపు సందర్భంగా విజయనగరంలో నవశకం సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభలో నారా లోకేశ్ తనదైన శైలీలో కౌంటర్లు వేశారు. ఇక ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇరు పార్టీ శ్రేణుల కోలహలంతో విజయోత్సవ సభ దద్దరిల్లింది. నారా లోకేశ్ ఏం అన్నారంటే? ➼ వచ్చే ఎన్నికలు జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య సాగే యుద్ధం. ➼ ఒకే వేదికపై ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలయ్యలను చూస్తే తాడేపల్లి ప్యాలెస్ టీవీలు పగులుతాయి. ➼ తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యువగళం ఆగదు. ➼ ప్రజా జీవితాలతో ఇప్పటికే ఆటలాడుకున్న జగన్, ఆడుదాo ఆంధ్రా అంటున్నాడు. ➼ జగన్ ఐపీఎల్ టీమ్ అంటూ పెడితే, దాని పేరు కోడికత్తి వారియర్స్. ➼ నవశకం బొమ్మ బ్లాక్ బాస్టర్. ➼ ఉత్తరాంధ్ర అండ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర కొండంత అండ, రాయలసీమ రత్నాల సీమ. ➼ నాకు ఎన్టీఆర్ ప్రసాదించిన గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టడు కూడా. ➼ జగన్ ది రాజారెడ్డి పొగరైతే, లోకేష్ ది అంబేద్కర్ రాజ్యాంగ పౌరుషం. ➼ చంద్రబాబు విజనరీ, జగన్ ప్రిజనరీ ➼ ప్రజా జీవితాలతో ఇప్పటికే ఆటలాడుకున్న జగన్, ఆడుదాo ఆంధ్రా అంటున్నాడు. ➼ పాదయాత్రతో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా ➼ జగన్ చేసిన విధ్వంసం అడుగడుగునా కనిపించింది. ➼ గుంతల్లో రోడ్డు ఎక్కడుందా అని వెతుక్కుంటూ నడిచా. ➼ రాయలసీమ జిల్లాల ప్రజలు పడుతున్న కష్టాలు చూసిన తరువాత మిషన్ రాయలసీమ ప్రకటించాను. ➼ పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, హార్టీ కల్చర్ హబ్ గా తయారు చేస్తాం, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారుస్తాం. ➼ ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా మారుస్తాం. ➼ నెల్లూరు లో ఆక్వా రైతుల కష్టాలు చూశాను. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా రూ.1. 50కే యూనిట్ విద్యుత్ అందిస్తాం. ➼ ప్రజా రాజధాని అమరావతి పూర్తి చేస్తాం. మిర్చి,పత్తి రైతులను ఆదుకుంటాం. ➼ ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, కొబ్బరి, వరి, పామ్ ఆయిల్ రైతులకు గతంలో ఇచ్చిన సబ్సిడీలు ఇస్తాం. మేజర్ రోడ్లు అన్ని సిసి రోడ్లు వేస్తాం. ➼ 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జగన్ గాలికి వదిలేశాడు. కోడిగుడ్డు మంత్రి అంటూ లోకేశ్ ఫైర్: నవశకం సభలో జగన్‌తో పాటు వైసీపీ మంత్రులపైనా లోకేశ్ కౌంటర్లు విసిరారు. కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఐటీ కంపెనీలు(IT Companies) అన్ని పక్క రాష్ట్రానికి పరార్ అయ్యాయని చురకలంటించారు. విశాఖ(Vizag) ని కేపిటల్ చేస్తానంటూ క్రైం కేపిటల్ చేశాడని... పరిపాలనా రాజధాని చేస్తానని కబ్జాల రాజధాని చేశాడని ఫైర్ అయ్యారు లోకేశ్. దసపల్లా భూములు, సిఎన్బిసి భూములు, హయగ్రీవ భూములు,ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, స్వతంత్ర సమరయోధుల భూములు, శివారు ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేశారని... టిడిఆర్ బాండ్స్ కుంభకోణంలో వేల కోట్లు వైసిపి నాయకులు కొట్టేశారని ఆరోపించారు లోకేశ్. రుషికొండకు గుండు కొట్టి 500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నారని మండిపడ్డారు. ఏ2 విజయసాయి రెడ్డి విశాఖను నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి విశాఖ మన్యంలో లేటరైట్, బాక్సైట్ ను దోచుకుంటున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ అవినీతికి అడ్డాగా మారిపోయిందని.. చెత్త ట్యాక్స్ తప్ప ఒక్క రోడ్డు వెయ్యరు, ఒక్క డ్రైనేజ్ కట్టరని లోకేశ్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ ను జగన్ చంపేశారని.. రాయితీలు ఇవ్వకపోవడంతో విజయనగరం జిల్లాలో ఉన్న 31 పైగా ఫెర్రో అల్లా యిస్ పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు లోకేశ్. చట్టాన్ని ఉల్లఘించిన వారి పేర్లు అన్ని రెడ్ బుక్‌లో ఉన్నాయని వారికి శిక్ష తప్పదని లోకేశ్ హెచ్చరించారు. Also Read: టీడీపీ జనసేన జోష్.. దద్దరిల్లిన యువగళం విజయోత్సవ సభ..! WATCH: #nara-lokesh #ys-jagan #tdp #kodikatthi-warriors మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి