"నిన్ను నమ్మం జగన్"... జగన్‌పై గంటా శ్రీనివాసరావు ఫైర్! ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో.. అప్పుల్లో 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమం దేనికోసమో చెప్పాలని అన్నారు. By V.J Reddy 09 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి TDP Leader Ganta Srinivasa Rao Letter To CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏపీని ఏమీ అభివృద్ధి చేయలేదని టీడీపీ నేతలు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీని ఎందుకు అభివృద్ధి చేయలేదని వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈరోజు సీఎం జగన్‌కు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో శ్రీనివాసరావు.. నిన్నటిదాకా "మా నమ్మకం నువ్వే జగన్" అన్నారు "నిన్ను నమ్మం జగన్" అని ప్రజలు మొహం మీదే చెప్పేశారని.. గడపగడపకూ వైసీపీ అన్నారు... గడపగడపలో అవమానంతో వెనుదిరిగారు... ఇప్పుడు "వై ఏపీ నీడ్స్ జగన్" అనే కొత్త పల్లవి అందుకొన్నారు.. ప్రజలు 'ఏపీ హేట్స్ జగన్' అనే స్వరం అందుకున్నారని సెటైర్లు వేశారు. ALSO READ: BJP Final List: ఆ 11 మంది ఎవరు?.. కొనసాగుతున్న ఉత్కంఠ! వై ఏపీ నీడ్స్ జగన్.. దేనికోసం? 1) రైతు భరోసా : రూ.50వేలు ఇస్తానని హామీ ఇచ్చి.. రూ.37,500కు కుదించారు. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలు రద్దు చేసి రూ. 2 లక్షలు నష్టం చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్...? 2) అమ్మఒడి : అమ్మఒడికి రూ.13వేలు ఇచ్చి నాన్న బుడ్డీలో రూ.70 వేలు కొట్టేస్తున్నారు. MTF, RTF స్కాలర్ షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలను రద్దు చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్...? 3) పెన్షన్లు : చంద్రన్న రూ.1800 పెంచగా, జగన్ రెడ్డి రూ.750 ఇచ్చారు. అధికారంలోకి వస్తే రూ.3 వేల పెన్షన్ హామీపై మాట తప్పారు. ఏటా పెంపు హామీపై మడమ తిప్పినందుకా వై ఏపీ నీడ్స్ జగన్...? 4) పేదలందరికీ ఇళ్లు : సెంటు పట్టా పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారు. భూమి కొనుగోలులో రూ. 7 వేల కోట్లు వైసీపీ నేతలు మింగేశారు. ఓటీఎస్ పేరుతో ఒక్కొక్కరి నుండి రూ.10వేల నుండి రూ.40 వేల చొప్పున బలవంతంగా వసూల్ చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్...?. 5) ఫీజు రీయింబర్స్మెంట్ : చంద్రన్న 16 లక్షల మందికి ఇచ్చారు. జగన్ రెడ్డి 7 లక్షల మందికి కోత కోసి 9 లక్షల మందికే ఇస్తున్నారు. చంద్రన్న ఒకే విడతలో ఇస్తే.. జగన్ రెడ్డి నాలుగు విడతలతో మోసం చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్...? 6) మద్య నిషేధం : రూ. 2 లక్షల కోట్లకు పైగా మద్యం అమ్మి పేదలను కొల్లగొట్టారు. రూ. లక్ష కోట్లు కమిషన్లుగా దండుకున్నారు. మద్య నిషేధంపై మాట తప్పి మహిళల మాంగళ్యాలను తెంచుతున్నందుకా వై ఏపీ నీడ్స్ జగన్...?. 7) జలయజ్ఞం: కృష్ణా గోదావరి జలాలపై హక్కుల్ని కేంద్రానికి, తుంగబద్రపై హక్కుల్ని కర్ణాటకకు తాకట్టు పెట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని దెబ్బతీసి నదుల అనుసంధానానికి గండికొట్టారు. రాష్ట్రాన్ని కరవు రక్కసికి బలిపెట్టారు. ఈ ఏడాది 34 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోయినందుకా చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్...? 8) ఆరోగ్యశ్రీ : రూ. 1400 కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసేందుకు నెట్ వర్క్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. 104, 108 అంబులెన్సులు అక్కరకు రాని చుట్టాలైనందుకా వై ఏపీ నీడ్స్ జగన్...? 9) ఆసరా : ఆసరా కింద మొండి బకాయిలున్న 25% మందికే లబ్ధి. సకాలం 75% మందికి జగన్ రెడ్డి టోకరా వేశాడు. చంద్రన్న పాలనలో డ్వాక్రా రుణమాఫీ, పసుపుకుంకుమ ద్వారా ఒక్కో మహిళకు రూ.20 వేల వరకు లబ్ది పొందారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ ఇచ్చి ఉంటే రూ. 1.80 లక్షల చొప్పున లబ్ది కలిగేది. హామీకి తిలోదకాలిచ్చి రూ.75వేలు అంటూ ఒక్కో మహిళకు రూ. 1.05 లక్షలు ఎగ్గొట్టినందుకా వై ఏపీ నీడ్స్ జగన్...? 10) ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం దోపిడీ చేసి రూ.3.5 లక్షల కోట్లు కొల్లగొట్టి.. పేదవాడికి పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమే అంటున్న మీరు.. దేశంలోని ముఖ్యమంత్రులు అందరికంటే ధనవంతుడైనందుకా వై ఏపీ నీడ్స్ జగన్...? 11) ప్రశ్నించిన పౌరులు, మీడియా, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, జైలు నిర్బంధాలు, హత్యలు, రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ టెర్రిస్టు పాలన చేస్తూ. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా చేసి. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్...? 12) రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ ద్వారా చంద్రబాబు గారి పాలనలో ఒక్కో రైతు రూ.1,15,000 లబ్ది పొందగా, వీటిని రద్దు చేసి రైతు భరోసా పేరుతో రూ.37,500 ఇచ్చి దగా చేసినందుకా... ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలోఉంది. ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు వున్నట్లు జాతీయ గణాంక సర్వే లో ఏపీ ను మొదటి స్థానంలో నిలిపినందుకా.. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో ఉంది" అని లేఖలో పేర్కొన్నారు. #ap-news #cm-jagan #ap-government #former-minister-ganta-srinivasa-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి