AP Politics: ఉండవల్లి ఓ ప్యాకేజీ లీడర్‌.. సజ్జల అక్రమాలు బయటపెడతాం.. బుద్దా వెంకన్న ఫైర్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు.

New Update
AP Politics: ఉండవల్లి ఓ ప్యాకేజీ లీడర్‌.. సజ్జల అక్రమాలు బయటపెడతాం.. బుద్దా వెంకన్న ఫైర్

వ్యవస్థలను మేనేజ్ చేసి గత 36 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారని బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఆరోపించారు. ఈ రోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జగన్ సర్కార్ రాజకీయ కక్ష సాధిస్తోందని ఫైర్‌ అయ్యారు.  జైలు అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణ రెడ్డి (Sajjala Ramakrishna Reddy).. నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ఆవేదనను అవహేళన చేయడం బాధాకరమన్నారు. సజ్జలకు చంద్రబాబు, కుటుంబ సభ్యులను విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మరో విషాదం..ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

సజ్జల అక్రమాలను బయటపెడతాం

సజ్జల సీఎంవోలో అధికారం ఉందని హద్దుదాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం (TDP government) వచ్చాక.. సజ్జల అక్రమాలను బయటపెడతాం అని హెచ్చరించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ప్యాకేజీ లీడర్‌ అంటూ విమర్శలు చేశారు. సీఎం జగన్ (CM Jagan) దగ్గర ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుపై కేసులు వేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ప్యాకేజిలు తీసుకున్న ఘనత ఉండవల్లి అరుణ్‌కే చెల్లుతుందని ఆరోపణలు గుప్పించారు. సజ్జల, ఉండవల్లి, కొడాలి నానికి పిచ్చి పరాకాష్టకు చేరిందని బుద్దా వెంకన్న ఆరోపించారు. అర్జెంట్‌గా రేబీస్ ఇంజక్షన్ చేయాలంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు హాని జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు.

ఇది కూడా చదవండి: అమిత్‌షాను లోకేష్ కలిసింది అందుకే.. అచ్చెన్నాయుడు సంచలన వాఖ్యలు

హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయాలి డిమాండ్

చంద్రబాబుకు పలు ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులు లిఖిత పూర్వకంగా రిపోర్ట్ అడిగినా పోలీసులు ససేమిరా అంటున్నారని ఆదేదన వ్యక్తం చేశారు. బాబు ఆరోగ్యంతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ఫైర్‌ అయ్యారు. వైఎస్‌ఆర్సీపీ నేతల (YSRCP leaders) ఒత్తిడితోనే హెల్త్ బులిటెన్ రిలీజ్ (Health Bulletin Release) చేయట్లేదని ఆరోపించారు.

ఇది కూడా చదవండి:  బార్బీ బొమ్మలా హీరోయిన్ సమంత ఫోజులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Terror Attack Vijayawada: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!

పహల్గాం దాడి దృష్ట్యా విజయవాడలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. SIMI అనుచరులుగా భావిస్తున్న నలుగురిని గుర్తించి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలోని అనుమానిత ప్రాంతాలలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టాయి.

New Update
Terror Attack Vijayawada

Terror Attack Vijayawada

Terror Attack Vijayawada: జమ్మూ కశ్మీర్‌లోని(Jammu and Kashmir) పహల్గాం(Pahalgam) ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిచింది. ఈ దాడి నేపథ్యంలో దేశంలోని అనేక నగరాల్లో పోలీస్‌ విభాగాలు అప్రమత్తమయ్యాయి. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కూడా ఉగ్రవాద కదలికలపై పోలీసులు   నిఘా పెట్టారు. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు.

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

విజయవాడ టార్గెట్‌గా..!

కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే రెండు నెలల క్రితమే విజయవాడను టార్గెట్‌గా ఉంచుకుని ఉగ్ర ముప్పు పొంచి ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో, నగరంలోని కొందరు వ్యక్తులపై పోలీస్‌ శాఖ నిఘా పెంచింది. తాజా సమాచారం ప్రకారం, సిమి (SIMI) తీవ్రవాద సంస్థకు మద్దతు పలికే నలుగురు అనుమానితులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఈ నలుగురిని పట్టుకోవాలనే ఉద్దేశంతో నగరంలోని గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట ప్రాంతాల్లో పోలీసులు విస్తృత సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వారి కదలికలపై పక్కాగా నిఘా పెట్టారు. విచారణలో ఇంకా నలుగురు సిమి అనుచరులు విజయవాడలో తలదాచుకుని ఉన్నట్లు తెలిపారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ప్రస్తుతం మొత్తం ఎనిమిది మంది అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతోంది. వీరిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి చిన్న సమాచారం‌ను జాగ్రత్తగా విశ్లేషిస్తూ, ఉగ్రవాద ముప్పును అడ్డుకునేందుకు నిఘా సంస్థలు, స్థానిక భద్రతా దళాలు కలిసి పని చేస్తున్నాయి.

దేశ భద్రతను సవాల్ చేసేలా మారుతున్న ఉగ్రవాద కదలికలను ముందే గుర్తించి అడ్డుకోవడమే లక్ష్యంగా అధికారులు, పోలీస్ యంత్రాంగం  ప్రయత్నిస్తున్నారు. పహల్గాం దాడికి సంబంధించిన పరిణామాలు ఇంకా చల్లారకముందే, విజయవాడ వంటి శాంతియుత నగరాల్లో ఉగ్ర ముప్పు వార్తలు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు