Andhra Pradesh: రేపు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే

ఏపీలో రేపు ఉదయం 9.30 AM గంటలకు విజయవాడలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. శాసనసభాపక్ష నేతగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని ఎన్నుకోనున్నారు. ఇక జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

New Update
Andhra Pradesh: రేపు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే

NDA MLA Meeting: ఏపీలో రేపు (మంగళవారం) ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఉదయం 9.30 AM గంటలకు విజయవాడలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. శాసనసభాపక్ష నేతగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) ఎన్నుకోనున్నారు. ఇక జూన్ 12న బుధవారం ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ఉదయం 11.27 PM నిమిషాలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే ఈసారి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనేది ఆసక్తి నెలకొంది. మరోవైపు జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్ తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఓ జాతీయ మీడియాకు చెప్పినట్లు వార్తలు రావడం చర్చనీయాంశమవుతోంది. ఇదిలాఉండగా.. ఈ ఎన్నికల్లో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. వైసీపీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక లోక్‌సభ స్థానాల్లో టీడీపీకి 16, జనసేన 2, బీజేపీ 3, వైసీపీ 4 సీట్లు వచ్చాయి.

Also Read: వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్ పెట్టాడు.. చివరికీ

Advertisment
Advertisment
తాజా కథనాలు