Andhra Pradesh: చంద్రబాబుకు అరెస్ట్‌కు నిరసనగా కాంతితో క్రాంతి కార్యక్రమం.. పాల్గొన్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. తెలుగుదేశం పార్టీ నేతలు కాంతితో క్రాంతి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు లైట్లు ఆపేసి, కొవ్వత్తులు వెలిగించి వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బ్రాహ్మణి సహా టీడీపీ ముఖ్య నేతలంతా కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో లోకేష్ ఈ కార్యక్రమం నిర్వహించారు. By Shiva.K 07 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి TDP Kantitho Kranti Programme: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. తెలుగుదేశం పార్టీ నేతలు కాంతిలో క్రాంతి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు లైట్లు ఆపేసి, కొవ్వత్తులు వెలిగించి వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బ్రాహ్మణి సహా టీడీపీ ముఖ్య నేతలంతా కాంతిలో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవ్వత్తులు వెలిగించి చంద్రబాబుకు తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కొవ్వత్తులు వెలిగించి చంద్రబాబుకు తమ సపోర్ట్ తెలియజేశారు. సేవ్ ఏపీ..సేవ్ డెమోక్రసీ.. 'కాంతితో క్రాంతి'లో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ ఏపీ.. సేవ్ డెమ్రోక్రసీ అని నినదించారు. టిడిపి అధినేత చంద్రబాబుకి సంఘీభావంగా ఢిల్లీలో నిర్వహించిన 'కాంతితో క్రాంతి' కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి వైసీపీ సర్కారు తీరుపై నిరసన తెలిపారు. సేవ్ ఏపి... సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో.. ముమ్మిడివరంలో టిడిపి శ్రేణులు కాంతితో క్రాంతి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, టిడిపి శ్రేణులు పాల్గొన్నారు. ముమ్మిడివరంలో NTR విగ్రహం నుండి టిడిపి కార్యాలయం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులు.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు జిల్లాలో.. టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. బాబుతో మేము.. ఏపీ విత్ సీబీఎన్.. అంటూ తెలుగు యువత దీపాలతో నిరసన వ్యక్తం చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, తెలుగు యువత నేత రావిపాటి సాయికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడి నేతలు.. చంద్రబాబు అక్రమ అరెస్టు సైకో జగన్ పాలనకు నిదర్శనం అని విమర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చెయ్యడంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుందన్నారు. చంద్రబాబుతోనే రాష్టానికి వెలుగు అని పేర్కొన్నారు. చీకట్లు పోయి వెలుగులు వచ్చినట్లు చంద్రబాబు బయటకు వస్తారని అన్నారు. అక్రమ కేసులుపెట్టిన సైకోకు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని చెప్పారు.. ఏలూరు జిల్లాలో.. జిల్లా వ్యాప్తంగా చంద్రబాబుకు మద్ధతుగా టీడీపీ ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏలూరు టీడీపీ పార్టీ కార్యక్రమంలో ఇన్ చార్జి బడేటి చంటి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన.. బడేటి చంటి.. ఎలక్షన్ స్టంట్‌లో భాగంగానే చంద్రబాబును ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటే ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి ఎక్కడ జరిగిందో ప్రభుత్వం చెప్పలేకపోతోందని విమర్శించారు. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గంలో.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అవనిగడ్డలో నల్ల బెలూన్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు టీడీపీ శ్రేణులు. శనివారం సాయంత్రం మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు, టీడీపీ నాయకులు నల్ల బెలూన్లతో ర్యాలీ నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విశాఖలో టిడిపి నేతలు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆర్కే బీచ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు. Also Read: TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు.. అసలు ఏం అయిదంటే..? #andhra-pradesh #andhra-pradesh-news #tdp-leaders #tdp-kantitho-kranti-programme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి