ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

ప్రధాని మోదికి టీడీపీ ఛీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపారు.

New Update
ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

Chandra Babu: ప్రధాని మోదికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తుపాను వల్ల నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోదీని కోరారు.

ALSO READ: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌.. ఫొటోలు వైరల్..

తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పర్యటన చేపట్టారు చంద్రబాబు. వారికి అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుందని భరోసా చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. యానాదుల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తనదని తెలిపారు. టీడీపీ(TDP) తరఫున ఒక్కో ఇంటికి రూ. 5 వేలు సాయం అందిస్తున్నాం అని చెప్పారు.

తుఫాన్ బాధితులను ఏపీ ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని అన్నారు. జగన్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల పడుతున్న సమస్యలు కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. తుఫాన్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. వారికి రూ.45వేల నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు.

publive-image publive-image

ALSO READ: ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో.. భట్టి కీలక వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు